AKP: కోటవురట్ల మండలంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం చురుగ్గా సాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఎంపీడీవో చంద్రశేఖర్ ఎండపల్లి గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. సాయంత్రంలోగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు పేర్కొన్నారు.