Video Viral : యువకుడి చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే..!
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జరుగుతుండగా ఎమ్మెల్యే ఎంబీ పాటిల్ ఓ యువకుడిపై చేయిచేసుకున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్ణాటక(Karnataka)లో ఎన్నికల(Elections) ప్రచారం సాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంబీ పాటిల్(Congress MLA MB Patil) కార్యకర్తల సమక్షంలో రెచ్చిపోయాడు. ప్రచారంలో భాగంగా ఆయన సహనం కోల్పోయి ఓ యువకుడిపై చేయిచేసుకున్నాడు. అందరి ముందు ఆ వ్యక్తి చెంప పగలగొట్టాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
యువకుడి చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే వీడియో:
బాబలేశ్వర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంబీ పాటిల్(Congress MLA MB Patil) ఎన్నికల ప్రచారం(Election Campaign)లో భాగంగా ఓ గ్రామానికి చేరుకున్నాడు. స్థానికులతో మాట్లాడుతుండగా ఓ యువకుడు అందరి ముందు ఎమ్మెల్యేను నిలదీశాడు. తమ గ్రామానికి ఆ ఎమ్మెల్యే ఏం చేశాడని ప్రశ్నించాడు. అందరి సమక్షంలో ఆ యువకుడికి ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కోపంతో ఆ యువకుడిపై చేయిచేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్(Video Viral) అవుతోంది.
ఈ వీడియోను బీజేపీ(BJP) తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. ట్విట్టర్ లో స్పందించింది. గూండాయిజం కాంగ్రెస్(Congress) డీఎన్ఏలోనే ఉందని ఆరోపణ చేసింది. సమస్యలు చెప్పుకుంటే దాడి చేయడం మాత్రమే కాంగ్రెస్ కు తెలుసని బీజేపీ(BJP) విమర్శలు గుప్పించింది. స్థానికులు కూడా ఎమ్మెల్యే చేసింది కరెక్టు కాదని మండిపడ్డారు. ఈ వివాదంపై ఎమ్మెల్యే పాటిల్(MLA Patil) స్పందిస్తూ..ఆ యువకుడు అన్‌పార్లమెంటరీ పదాలు వాడారని, అందుకే ఆ వ్యక్తిపై చేయిచేసుకున్నానని వివరణ ఇచ్చాడు.