»Planets Visible From Earth On March 28 Mercury Venus Mars Jupiter And Uranus Will Gather Together In The Sky In A Small 50 Degree Sector Gh Srd
Planets Visible From Earth: ఆకాశంలో అద్భుతం..28న ఒకే రేఖపైకి ఆ ఐదు గ్రహాలు!
బుధుడు(Mercury), శుక్రుడు(Venus), అంగారకుడు(Mars), బృహస్పతి(Jupiter), యురేనస్(Uranus) గ్రహాలు 50 డిగ్రీ సెక్టార్లో కనువిందు చేయనున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఆకాశంలో కనిపించే ఈ అరుదైన ఘటనను చూసేందుకు 28వ తేది సూర్యాస్తమయం అయిన తర్వాత బైనాక్యులర్స్ తో చూడొచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ ఐదు గ్రహాలు(5 Planets) కచ్చితంగా స్ట్రైట్ లైన్ లో కనిపించకపోయినా భూమికి నుంచి చూసినప్పుడు అవంతా కూడా ఒకే లైనులో ఒక ఆర్క్ ఆకారంలో కనిపిస్తాయని శాస్త్రవేత్తలు(Scientists) తెలుపుతున్నారు.
ప్రకృతిలో అనేక వింతలు(Wonders) జరుగుతూ ఉంటాయి. తాజాగా ఆకాశం(SKY)లో అద్భుతం జరగనుందని పరిశోధకులు చెబుతున్నారు. మార్చి 24వ తేదిన పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన వేళ ఆకాశంలో అద్భుత దృశ్యం జరిగింది. సౌరకుటుంబంలో అత్యంత ప్రకాశవంతమైన శుక్రుడు(Venus) చంద్రునికి దగ్గరగా వచ్చాడు. ఈ శుక్ర, చంద్ర సంయోగం ఒక అద్భుతం అని ఖగోల పరిశోధకులు చెబుతున్నారు. అలాగే మార్చి 28వ తేదిన రాత్రంతా ఐదు గ్రహాలు(5 Planets) భూమిపై నుంచి చూసే అవకాశం ఉంది.
బుధుడు(Mercury), శుక్రుడు(Venus), అంగారకుడు(Mars), బృహస్పతి(Jupiter), యురేనస్(Uranus) గ్రహాలు 50 డిగ్రీ సెక్టార్లో కనువిందు చేయనున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఆకాశంలో కనిపించే ఈ అరుదైన ఘటనను చూసేందుకు 28వ తేది సూర్యాస్తమయం అయిన తర్వాత బైనాక్యులర్స్ తో చూడొచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ ఐదు గ్రహాలు(5 Planets) కచ్చితంగా స్ట్రైట్ లైన్ లో కనిపించకపోయినా భూమికి నుంచి చూసినప్పుడు అవంతా కూడా ఒకే లైనులో ఒక ఆర్క్ ఆకారంలో కనిపిస్తాయని శాస్త్రవేత్తలు(Scientists) తెలుపుతున్నారు.
మార్చి 28వ తేదిన ఖగోళ దృశ్యాన్ని లార్జ్ ప్లానెటరీ అలైన్ మెంట్ అంటారు. 5 నుంచి 6 గ్రహాలు ఒకే టైంలో సూర్యుడి(Sun)కి ఒకే వైపు రావడం చూడొచ్చు. ఇలాంటి ఘటన చివరిసారిగా జూన్ నెలలో 2022లో జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అది కనిపించనుంది. ఈ ఐదు గ్రహాల(5 Planets)లో ఎక్కువగా మనం శుక్ర గ్రహాన్ని అత్యంత ప్రకాశవంతంగా ఉండటాన్ని గమనించవచ్చని పరిశోధకులు వెల్లడించారు.