NRPT: బంగారం, చేనేత చీరలకు పేరుగాంచిన నారాయణపేటలో బంగారు ఆభరణాలకు జీఐ ట్యాగ్ (భౌగోళిక సూచి) గుర్తింపు కోసం వ్యాపారులు కృషి చేస్తున్నారు. ఇక్కడి బంగారు వ్యాపారానికి సుమారు 130 ఏళ్ల చరిత్ర ఉంది. పట్టణంలో దాదాపు 150 బంగారు దుకాణాలు, 270 మందికిపైగా స్వర్ణకారులు ఉన్నారు. 24 క్యారెట్ల బంగారంతో ప్రత్యేక డిజైన్ల ఆభరణాలు తయారు చేయడం వీరి ప్రత్యేకత.