AP: గత ప్రభుత్వంలో పట్టాదార్ పాసుపుస్తకాలు కూడా తారుమారు అయ్యాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనాభా పెరగాల్సిన అవసరం ఉందని, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఆయన పిలుపునిచ్చారు. పెద్ద కుటుంబాలకు అధిక ప్రయోజనం చేకూరేలా పథకాలు రూపొందిస్తామని, సూపర్ సిక్స్ హామీల అమలు కోసం అనునిత్యం కష్టపడతానని ప్రజలకు భరోసా ఇచ్చారు.