WNP: పట్టణంలోని 14వ వార్డు బ్రహ్మంగారి వీధిలో తాగునీటి పైప్లాన్ లీకేజీ కారణంగా తవ్వారు. సుమారు నెల రోజులు కావస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో గుంతలో తాగునీటి పైప్లాన్ సన్నగా లీకై నీరు కలుషితం అవుతున్నదని వెంటనే అధికారులు స్పందించి పైప్లాన్ లీకేజీ కాకుండా సరిచేసి గుంతను పూడ్చాలని సీపీఎం వనపర్తి పట్టణ కార్యదర్శి పరమేశ్వర డిమాండ్ చేశారు.