SDPT: బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వయం పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టి చిన్నారులకు పాఠాలు బోధించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు షాబొద్దీన్ మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వం, బాధ్యతాభావం పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు.