చైనాలోని గ్వాంగ్జౌ నగరం ‘ఫ్లవర్ సిటీ’గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పార్కులే కాకుండా వంతెనలు, రహదారులపై రంగురంగుల బోగన్ విలియా పూలు కనువిందు చేస్తాయి. వందల ఏళ్ల పూల అనుబంధం ఉన్న ఈ నగరంలో తరచూ పూల పండుగలు జరుగుతాయి. రోడ్లకి ఇరువైపులా వికసించే పూల సోయగం పర్యాటకులకు ప్రకృతి ఒడిలో ఉన్న సరికొత్త అనుభూతిని పంచుతుంది.