»People Who Drink Alcohol Should Not Come To The Wedding Good Letter Going Viral
wedding card : మద్యం తాగేవాళ్లు పెళ్లికి రావొద్దు..వైరల్ అవుతున్న శుభ లేఖ
వివాహ ఆహ్వానపత్రికలో మందు తాగి ఉంటే పెళ్లికి రావద్దు అని ప్రింట్ చేయించారు. దీంతో పెళ్లి పత్రిక నెట్టింట వైరలవుతుంది.మద్యం (wine) కారణంగా కాపురాలు కూలిపోవడమే కాదు..అతిధుల మధ్య గొడవలతో వివాహాలు ఆగిపోయిన ఘటనలు చాలా చూశాం. తాజాగా గుజరాత్ రాజకోట్ లోని హడల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కూతురి పెళ్లి కోసం వినూత్నంగా ఆలోచించాడు.
ఒక వెడ్డింగ్ కార్డు (wedding card) ఇప్పుడు సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతోంది. పెళ్లి శుభలేఖ వైరల్ కావటం ప్రస్తుత కాలంలో మామూలే అయిపోయింది. ఎందుకంటే..ఇప్పుడు ట్రెండ్ మారింది. కొత్త తరహాలో ఆలోచిస్తోంది యువతరం.. ముఖ్యంగా తమ పెళ్లి విషయంలో మరింత క్రియేటివిటీని యాడ్ చేసుకుంటున్నారు. పెళ్లికార్డు నుంచి.. పెళ్లి వేదిక.. ఇతర కార్యక్రమాలు అన్నీ వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు.. తాజాగా గుజరాత్(Gujarat) కు చెందిన ఓ వివాహ ఆహ్వాన పత్రిక(Wedding invitation card) ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తోంది. సాధారణంగా పెళ్లి పంక్షన్లలో బంధువులు మందు తాగి చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతుండటం చూశాం. అయితే కొన్ని సందర్భాలలో స్వయంగా పెళ్లి కొడుకు తాగి రావడం,పెళ్లి (Marriage) ఆగిపోయిన ఘటనలు కూడా చూశాం.
మద్యం (wine) కారణంగా కాపురాలు కూలిపోవడమే కాదు..అతిధుల మధ్య గొడవలతో వివాహాలు ఆగిపోయిన ఘటనలు చాలా చూశాం. తాజాగా గుజరాత్ రాజకోట్ లోని హడల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కూతురి పెళ్లి కోసం వినూత్నంగా ఆలోచించాడు. అయితే గుజరాత్(Gujarat)లోని రాజ్ కోట్ లోని హడలా గ్రామానికి చెందిన మన్సుక్ సీతాపర కూతురు వివాహం గురువారం జరిగింది. అయితే వివాహ ఆహ్వానపత్రికలో మందు తాగి ఉంటే పెళ్లికి రావద్దు అని ప్రింట్ చేయించారు. దీంతో పెళ్లి పత్రిక నెట్టింట వైరలవుతుంది. గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో మద్యపాన నిషేదం ఉన్నప్పటికీ అక్రమ మార్గాల ద్వారా మద్యం సరఫరా జరుగుతోంది.తాగి తూలే అతిథులు మరియు గొడవలకు దూరంగా పెళ్లి కార్యక్రమం ఉంచాలనే ఆలోచనతో ఇలా చేసినట్లు అర్థమవుతోంది.