»Man Fired For Being Bald Despite Full Head Of Hair Wins Payout
bald head: బట్టతల ఉందని ఉద్యోగం నుండి తొలగింపు, రూ.70 లక్షల నష్టపరిహారం
బట్టతల ఉందని ఓ వ్యక్తిని ఉద్యోగం నుండి తొలగించగా, అది కంపెనీకి గట్టి షాక్ తగిలింది. చివరకు అతనికి భారీ మొత్తంలో జరిమానా రూపంలో చెల్లించవలసి వచ్చింది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లో జరిగింది.
బట్టతల ఉందని ఓ వ్యక్తిని ఉద్యోగం నుండి తొలగించగా, అది కంపెనీకి గట్టి షాక్ తగిలింది. చివరకు అతనికి భారీ మొత్తంలో జరిమానా రూపంలో చెల్లించవలసి వచ్చింది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లో జరిగింది. లీడ్స్‌లోని టాంగో నెట్ వర్క్ అనే మొబైల్ సంస్థలో సేల్స్ డైరెక్టర్‌గా పని చేస్తున్న 61 ఏళ్ల మార్క్ జోన్స్‌ను కంపెనీ ఉద్యోగం నుండి తొలగించింది. ఇందుకు ఆసక్తికర కారణం ఉంది. 50 సంవత్సరాలు దాటి, బట్టతల ఉన్న వారు తన బృందంలో ఉండకూడదని బాస్ నిర్ణయించుకున్నాడు. దీంతో అతనిని పక్కన పెట్టింది కంపెనీ. అయితే తనను అన్యాయంగా ఉద్యోగం నుండి తొలగించారనే జోన్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఆ కంపెనీపై దావా వేశాడు. ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం కంపెనీకి గట్టి షాకిచ్చింది. పిటిషన్‌దారుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఎలాంటి కారణం లేకుండా, వర్క్ ప్లేస్ డిస్క్రిమినేషన్ కనిపించిందంటూ అతనికి 71వేల పౌండ్లు జరిమానాగా చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. దీంతో ఈ మొత్తాన్ని కంపెనీ అతనికి చెల్లించవలసి వచ్చింది. మన భారత కరెన్సీలో ఇది రూ.70 లక్షలకు పైమాటే. ఇక్కడ మరో విషయం ఏమంటే.. బట్టతల ఉందని జోన్స్‌ను తొలగించిన బాస్ పిలిప్ హెస్కెత్కు బట్టతల ఉండటం. జోన్స్‌ను తొలగించాలని నిర్ణయించడానికి ఎలాంటి సరైన కారణం కనిపించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.