»Heart Attacks Are More Common Among Young People The Reasons Are
Heart Attack Reasons: యువతలో ఎక్కువగా గుండెపోటు ప్రమాదాలు..కారణాలివే
కరోనా(Corona) తర్వాత గుండెపోటు(Heart Attack) ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఈ ప్రమాదం అందర్నీ భయపెడుతోంది. ముఖ్యంగా యువతలో ఈ ప్రమాదం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మధ్యనే ఓ వ్యక్తి వివాహం జరుగుతుండగా గుండెపోటు(Heart Attack) వచ్చి ప్రాణాలు విడిచిన ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా మంది షాక్ అయ్యారు.
కరోనా(Corona) తర్వాత గుండెపోటు(Heart Attack) ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఈ ప్రమాదం అందర్నీ భయపెడుతోంది. ముఖ్యంగా యువతలో ఈ ప్రమాదం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మధ్యనే ఓ వ్యక్తి వివాహం జరుగుతుండగా గుండెపోటు(Heart Attack) వచ్చి ప్రాణాలు విడిచిన ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా మంది షాక్ అయ్యారు.
తాజాగా శుక్రవారం కూడా హైదరాబాద్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థికి గుండెపోటు(Heart Attack) వచ్చింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు యువతలో ఈమధ్య గుండెపోటు ప్రమాదాలు రావడానికి గల కారణాలేంటోనని వైద్య నిపుణులు కూడా పరిశోధనలు చేపట్టారు. ప్రస్తుతం దీనికి గురించి పలువురు వైద్యులు(Doctors) వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు. యువతలో వచ్చే ఈ గుండెపోటు(Heart Attack) ప్రమాదాలను విడో మేకర్ హార్ట్ స్ట్రోక్ గా వైద్యులు వెల్లడించారు.ః
యువతలో ఈ మధ్యకాలంలో ఆహారపు అలవాట్లు(Food Habits) పూర్తిగా మారిపోయాయని, వాటివల్లే ఈ రకమైన గుండెపోటు(Heart Attack) ప్రమాదాలు వస్తున్నాయని వైద్యులు తెలుపుతున్నారు. చాలా మంది ఆరోగ్యకరమైన కూరగాయలకంటే ఫాస్ట్ ఫుడ్స్(Fast Foods)ను ఎక్కువగా తింటున్నారు. ప్యాక్ చేసిన ఆహార పదార్థాల(packaged Food)ను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో అనేక హానికరమైన మార్పులు జరుగుతున్నాయి.
ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడేవారికి విడోమేకర్ గుండె పోటు(Heart Attack) వచ్చే ప్రమాదం ఎక్కువని వైద్యులు తెలియజేస్తున్నారు. ఛాతినొప్పి, కడుపు నొప్పి, అలాగే శరీరంలోని చేతులు, భుజాలు, మెడ, దవడ వంటి ప్రాంతాల్లో నొప్పులు రావడం, తల తిరగడం, శ్వాస ఆడకపోవడం, అలసట అనిపించడం వంటివి యువతలో ఎక్కువగా కనిపిస్తోందని, వీటివల్లే గుండె(Heart)పై తీవ్రమైన భారం పడుతోందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఇటువంటి గుండెపోటు(Heart Attack) ప్రమాదాలను నివారించాలంటే కచ్చితంగా వ్యాయామం చేయాలని, తక్కువ చక్కెర కంటెంట్(Sugar Content) ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని, మంచి కొవ్వులు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆయిల్ తక్కువగా ఉండే పదార్థాలను తినాలని, పండ్లు(Fruits), కూరగాయలు(Vegitables), ఆకుకూరలు తినడం, రోజులో మూడు పూటలా శరీరానికి అవసరమైన ఆహారాన్ని తీసుకోవడం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. చాలా మంది యువత సరైన ఫుడ్ తీసుకోకుండా ఒత్తిడి, టెన్షన్స్ బారిన పడటం వల్ల ఈ గుండె ప్రమాదాలు(Heart Attack) ఎక్కువవుతున్నాయి. అందుకే వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉండటం, కుటుంబ సభ్యులతో గడపడం, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలను సందర్శించడం వంటివి చేసినా మనసు ఉత్తేజమై ఆరోగ్యకరంగా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు.