»Health Tipsafter Lunch And Breakfast Dont Take Tea
dont take tea this time:ఈ టైమ్‌లో టీ తీసుకోవద్దు, డైటీషియన్స్ ఏం చెబుతున్నారంటే?
జీవితంలో ‘టీ’ (Tea) ఒక భాగం అయిపోయింది. ఉదయం లేచింది మొదలు.. పొద్దు పొడిచే వరకు తాగుతూనే ఉంటాం. టీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డైటీషియన్స్ చెబుతున్నారు. ఎక్కువ టీ తీసుకుంటే గ్యాస్ (gas) వస్తోందని.. కాస్త దూరంగా ఉండాలని సజెస్ట్ చేస్తున్నారు. రోజుకు 2 నుంచి 3 కప్పుల (3 cups) వరకు అయితే ఫర్లేదు.. కానీ అంతకుమించి తీసుకుంటేనే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
dont take tea this time:జీవితంలో ‘టీ’ (Tea) ఒక భాగం అయిపోయింది. ఉదయం లేచింది మొదలు.. పొద్దు పొడిచే వరకు తాగుతూనే ఉంటాం. రకరకాల ఛాయ్ అందుబాటులో ఉన్నాయి. ఏదీ అతి తీసుకున్న అంతే సంగతులు.. టీ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డైటీషియన్స్ చెబుతున్నారు. ఎక్కువ టీ తీసుకుంటే గ్యాస్ (gas) వస్తోందని.. కాస్త దూరంగా ఉండాలని సజెస్ట్ చేస్తున్నారు. రోజుకు 2 నుంచి 3 కప్పుల (3 cups) వరకు అయితే ఫర్లేదు.. కానీ అంతకుమించి తీసుకుంటేనే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
‘టీ’లో రకాలు
‘టీ’లలో చాలా రకాలు ఉన్నాయి. గ్రీన్ టీ (green tea), లెమన్ టీ (lemon tea), కడక్ ఛాయ్ (kadak chai), మసాలా టీ (masala tea), హెర్బల్ టీ (herbal tea) ఇలా చాలానే ఉన్నాయి. బ్లాక్ టీ (black tea), గ్రీన్ (green), లెమన్ టీ (lemon tea) ఆరోగ్యపరంగా మేలు చేస్తాయి. ఫ్యాట్ కరిగించడంలో సహాయపడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో హెర్బల్ టీ సహకరిస్తోంది. మితంగా టీ తాగడం వలన వచ్చే ఇబ్బందేమీ లేదని డైటీషియన్స్ అంటున్నారు. టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. నిద్రలేమి, గుండెల్లో మంట వస్తోందని నిపుణులు చెబుతున్నారు. అలాగే టైమ్ ప్రకారం తీసుకోవాలని కోరుతున్నారు. ఖాళీ కడుపుతో టీ తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
డైటీషియన్స్ ఏమంటున్నారంటే?
ఛాయ్ (chai) ఏ సమయంలో తాగాలనే అంశంపై డైటీసియన్ శృతి భరద్వాజ్ (sruthi) వెల్లడించారు. ఇటీవల అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న తారకరత్నకు (tarakaratna) నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో ఈమె సీనియర్ క్లినికల్ డైటీషియన్‌గా పనిచేస్తున్నారు. ఉదయం లేదంటే సాయంత్రం టీ తీసుకోవడం వల్ల వచ్చే ముప్పేమీ లేదంటున్నారు. టిఫిన్ (tiffin) లేదంటే భోజనంతోపాటు (linch) టీ తీసుకోకుండా ఉండటం మంచిదని భరద్వాజ్ చెప్పారు. జెన్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ డైటీషియన్ ప్రియా పాలన్ (priya palan) మాత్రం అల్పాహారంతో టీ తీసుకుంటే ఇబ్బందేమీ లేదని పేర్కొన్నారు.
యాక్టివ్‌గా ఉండేందుకు దోహదం
టీలో (tea) యాసిడిటీకి దోహదపడే టానిన్లు ఉంటాయి. ఒక వ్యక్తికి ఎసిడిటీ తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం ఖాళీ కడుపుతో ఎట్టి పరిస్థితుల్లో టీ తీసుకోవద్దు. ఆ సమయంలో పాలు (milk) తీసుకోవడం మేలని ప్రియా పాలన్ వెల్లడించారు. ఒకవేళ మీరు భోజనం చేసిన తర్వాత టీ తాగుదాం అనుకుంటే హెర్బల్ టీని (herbal tea) ట్రై చేయాలని కోరుతున్నారు. చాలా యాక్టివ్‌గా పని చేసేందుకు సహకరిస్తాయి. మంచి విశ్రాంతిని కలిగిస్తాయి.
3 కప్పుల వరకు అయితే ఓకే
రోజు 2 – 3 కప్పుల (3 cups tea) టీ తాగడం మేలని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయే ముందు టీని అవాయిడ్ చేయాలని స్పష్టంచేశారు. టీని ఎక్కువసేపు మరిగించవద్దని చెబుతున్నారు. మరిగిస్తే టీ దాని ప్రయోజనాలను కోల్పోతుంది. పాలు (milk), పంచదార (sugar) ఎక్కువగా వేయకూడదట. టీలో రియల్ ఎసెన్స్ అనేది పాలు, పంచదారను జోడించకుండానే సాధ్యమవుతుందట. పాలు తప్పని సరిగా పోయాల్సిందే అనుకుంటే మాత్రం మరిగిన డికాషన్‌లో వేడి పాలు వేసి వెంటనే గ్యాస్ ఆఫ్ చేయండి. ఎక్కువగా మరిగించవద్దని సూచిస్తున్నారు.
టీ బ్యాగులు వద్దు
టీ బ్యాగులను (tea bags) ఉపయోగించవద్దని.. దానికి బదులుగా టీ ఆకులను వాడాలని కోరుతున్నారు. రాత్రిపూట టీ తాగాలనుకుంటే.. 8:30 గంటలకు తాగడం ఉత్తమం. ఈ సమయంలో మన జీర్ణక్రియ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆహార జీవక్రియలో సహాయపడటానికి కెఫీన్‌ను అదనంగా తీసుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో టీ తాగడం వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫ్లూ (flue), జలుబులను (clod) నివారిస్తుంది.