AP: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గోవాలో నకిలీ మద్యం కేంద్రాన్ని సిట్ అధికారులు గుర్తించారు. సౌత్, నార్త్ గోవా, పనాజీ, మార్గావ్లో కల్తీ లిక్కర్ విక్రయాలు జరిపారని, నిందితుడు జతిన్ కేరళకు చెందిన వ్యక్తిగా సిట్ గుర్తించింది. గోవాలో జతిన్ కోసం సిట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. జతిన్ జనార్దన్ రావుతో కలిసి డంప్ ఏర్పాటు చేసినట్లు సమాచారం.