BDK:మెంథా తుఫాను ప్రధానంగా రైతాంగాన్ని తీవ్రమైన సంక్షోభంలో పడవేసిందని సీపీఐ (ఎంఎల్ ) న్యూడెమోక్రసీ ఇల్లందు నియోజకవర్గం గార్ల మండల కార్యదర్శి జీ. సక్రు అన్నారు. నోటికొచ్చిన వరి పంట నీట మునిగిపోయిందని, పత్తి పంట ఏరటానికి రాకుండా పంట చేలలోనే తడిసి నల్లగా మారి మొలకెత్తి పరిస్థితి ఏర్పడిందని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఇవాళ కోరారు.