SKLM: తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే 20 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా రైల్వే జీఎం పరమేశ్వర ఈ రైళ్లను మళ్లీ పునరుద్ధరించినట్లు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ మేరకు రైళ్లను ప్రారంభించామని, ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులను తెలిపారు.