అమెరికాను ఉద్దేశిస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ పాలనకు సపోర్ట్ ఇవ్వడం పూర్తిగా ఆపేవరకు అగ్రరాజ్యానికి సహకరించడం కుదరదని తేల్చి చెప్పారు. సైనిక స్థావరాలను తొలగించడంతో పాటు మధ్యప్రాచ్యంలో ఆ దేశం కల్పించుకోకుండా ఉంటే దాంతో కలుస్తామని తెలిపారు. ఈ విషయంలో అమెరికా అహంకారంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు.