ఆసిఫాబాద్ జిల్లాలో మహిళలు, యువతుల భద్రత కోసమే షీ టీమ్స్ పనిచేస్తున్నాయని SP కాంతిలాల్ పాటిల్ ఇవాళ తెలిపారు. హింసకు గురైతే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. అక్టోబర్ నెలలో షీ టీమ్స్ ద్వారా 87 హాట్ స్పాట్లను గుర్తించి, 22 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ క్రమంలో 16 మంది అకతాయిలను పట్టుకుని, ఆరుగురిపై FIR నమోదు చేశామన్నారు.