విమాన ప్రయాణికులకు DGCA శుభవార్త చెప్పింది. ఇకపై టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల్లోపు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా రద్దు లేదా మార్పులు చేసుకునేందుకు వీలు కల్పించనుంది. నిర్ణీత సమయంలో రద్దు చేసుకుంటే ఎయిర్లైన్స్ అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా తక్షణమే రీఫండ్ ఇవ్వనుంది. అయితే, ప్రస్తుతం ఈ నిబంధనలు డ్రాఫ్ట్ దశలో ఉన్నాయని.. త్వరలో పూర్తిగా అమల్లోకి వస్తాయని వెల్లడించింది.