కోనసీమ: ముమ్మిడివరం మండలంలోని గున్నేపల్లి గ్రామంలో మొంథా తుఫానుతో తీవ్రంగా ప్రభావితమైన కుటుంబాలకు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో తుఫాను బాధితుల పునరావాసం, సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయన్నారు.