W.G: పెనుమంట్ర మండలం చెన్నాడచెరువులోని రహదారి కోతకు గురై ప్రయాణం కష్టతరంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. సమీపంలోని పాలమూరు, నాగలదిబ్బ గ్రామాలకు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం కావడంతో ఈ దారిలో రాకపోకలు సాగించే వాహనదారులు, పాదాచారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.