Viral: ఒకేసారి ఐదుగురిని ప్రెగ్నెంట్ చేశాడు..అంతటితో ఆగకుండా ఏం చేశాడంటే
ఓ యువకుడు ఐదుగురి అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఐదుగురూ ఒకేసారి గర్భవతులు కావడంతో వారిని ఓ చోటుకు చేర్చి బేబీ షవర్ వేడుక నిర్వహించారు. నెట్టింగ ఈ ఘటన వైరల్ అవుతోంది.
ఓ వ్యక్తి ఒకేసారి తన ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేసి అందర్నీ గర్భవతులను చేశాడు. అంతటితో ఆగకుండా అందర్నీ ఒకేచోటుకు తీసుకొచ్చి బేబీ షవర్ వేడుక చేశాడు. ఈ ఘటన న్యూయార్క్ నగరంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ ఐదుగురి బేబీ షవర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై పెళ్లికాని యువకులు షాక్ అవుతున్నారు. పెళ్లి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి పెళ్లి కుదరడం లేదని, ఇలాంటివి చూసినప్పుడు తమ మనసులు బరువెక్కుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
న్యూయార్క్ నగరానికి చెందిన సంగీతకారుడు జెడ్డీ విల్ ఒకేసారి ఐదుగురు గర్ఫ్రెండ్స్తో ప్రేమాయణం నడిపాడు. వారందరినీ ఒకేసారి గర్భవతులను చేశాడు. ఆ తర్వాత వారందరినీ ఒప్పించి మరీ వారికి ఘనంగా ఒకేసారి బేబీ షవర్ వేడుక చేశాడు. గర్భవతులైన వారిలో ఒకరైన యాష్లీ అనే మహిళ ఈ విషయాన్ని టిక్ టాక్ వీడియో ద్వారా షేర్ చేసింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి రావడం విశేషం.
ఐదుగురికి జరిగిన బేబీ షవర్ వేడుకల్లో అందరూ ఆనందంగా కనిపిస్తున్నారు. ఆ ఐదుగురు తమ బాయ్ ఫ్రెండ్ తో కలిసి డ్యాన్స్ చేశారు. అందరూ కలిసి మా పిల్లల డాడీ ఇతనే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ ను చూసి సింగిల్స్ రెచ్చిపోయారు. తమకు ఒక్కరూ దొరకట్లేదని, వాడికి మాత్రం ఐదుగురు కావాల్సి వచ్చిందా? టూ మచ్ బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.