శ్రీజ అంటే తెలియని వారుండరు. ఈమె మొదట శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఓ కూతురును కని విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ ను రెండో పెళ్లి చేసుకుంది.
Srija Daughter: సినిమాల్లో నటించక పోయిన పర్సనల్ లైఫ్ లో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ చాలా ఫేమస్ అయిపోయింది. హీరోయిన్లు అంటే తెలియని వారుంటారు కానీ.. శ్రీజ అంటే తెలియని వారుండరు. ఈమె మొదట శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఓ కూతురును కని విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ ను రెండో పెళ్లి చేసుకుంది. మళ్లీ ఓ కూతురు కన్న తర్వాత అతడి నుంచి కూడా విడిపోయి ఒంటరిగా ఉంటోంది. గత రెండేళ్లగా వీరిద్దరూ దూరంగానే ఉంటున్నారు. వీరి గురించి పుంకానుపుంకలు వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే శ్రీజ మూడో పెళ్లి, కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఎన్ని వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ ఈ జంట మాత్రం ఏ మాత్రం స్పందించలేదు. అసలు అధికారిక విడాకులు తీసుకున్నారా? లేదా? అన్న సంగతి మాత్రం తెలియలేదు.
కానీ ఒకరినొకరు మాత్రం సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక వీరి సంగతి పక్కన పెడితే.. ఈ జంట దూరంగా ఉంటున్న నేపథ్యంలో వీరిద్దరికీ పుట్టిన కూతురు నవిష్క మాత్రం చాల సఫర్ అవుతుంది. తల్లి శ్రీజ వద్దే పెరుగుతున్న నవిష్క తండ్రి ప్రేమ కోసం పరితపిస్తుంది. అప్పుడప్పుడు కళ్యాణ్ దేవ్ వద్దకు కూడా వెళ్తుంది. ఈ క్రమంలోనే తాజాగా దీపావళి పండుగ సందర్భంగా తండ్రి దగ్గరకు వెళ్లింది నవిష్క. తన కూతురు ఎప్పుడు వచ్చినా.. తన కూతురు తో ఎంజాయ్ చేసిన ఫోటోలను కళ్యాణ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో దీపావళి పండగకు తన పాపతో పండుగ చేసుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అయితే.. మెగా మనవరాలకి ఇంత కష్టం వచ్చిందేంటి.. తల్లిదండ్రులు ఇద్దరి ప్రేమ ఒకేసారి పొందే అదృష్టం లేదా. శ్రీజ, కళ్యాణ్.. నవిష్క కోసమైనా మళ్లీ కలిస్తే బాగుంటుందంటూ మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్, నవిష్క ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.