Biryani: బిర్యానీ (Biryani) అంటే అందరికీ ఇష్టమే. డిఫరెంట్ టైప్స్ బిర్యానీలు విక్రయిస్తున్నారు. ఇక తక్కువ ధర అంటే చాలు.. అక్కడికి ఎగేసుకొని వెళుతుంటారు. ఏపీలో గల భీమవరంలో కూడా ఇద్దరు అలానే వెళ్లారు. తమ వద్ద డబ్బులు ఉన్నాయని.. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలనే విషయం మాత్రం మరచిపోయారు. బిర్యానీ (Biryani) ఆరగించి.. తీరా వచ్చి చూసేవరికి డబ్బులు లేవు. దీంతో లబోదిబో మని బాదుకోవడం వారి వంతు అయ్యింది.
భీమవరానికి చెందిన ఓ వ్యక్తి వద్ద ఇద్దరు యువకులు (youth) పనిచేస్తున్నారు. బ్యాంకులో రూ.4 లక్షల నగదు డిపాజిట్ చేయమని పని అప్పగించాడు. బ్యాంక్‌కు వెళ్లగా.. కాస్త ఆలస్యమైంది. డబ్బులు తీసుకోవడం కుదరదు అని చెప్పేశారు. దీంతో ఆ నగదును స్కూటీ డిక్కీలో పెట్టారు. మధ్యాహ్నం అయ్యింది కదా.. ఏమైనా తిందాం అని పట్టణంలో గల సీతయ్య హోటల్ (sithaiah hotel) వద్దకు చేరుకున్నారు.
సీతయ్య హోటల్లో రూ.80కే బిర్యానీ (biryani) విక్రయిస్తారు. తక్కువ ధర.. మంచి ఫుడ్ అని తెలిసి.. కంగారుగా వెళ్లిపోయారు. ఇంకేముంది ఆ స్కూటీ డిక్కీ వద్దకు దొంగలు వచ్చారు. ఆ యువకులను వారు ఫాలొ చేశారో తెలియదు కానీ.. స్కూటీ డిక్కీ ఓపెన్ చేశారు. అందులో చూడగా డబ్బు కనిపించింది. ఆ డబ్బు బ్యాగ్‌ను తీసుకెళ్లారు. బిర్యానీ తిని వచ్చి చూడగా.. బ్యాగు కనిపించలేదు. దీంతో షాక్ తినడం వారి వంతు అయ్యింది.
భీమవరంలో 80 రూపాయల బిర్యానీ కోసం వెళ్లి 4 లక్షలు పోగొట్టుకున్న యువకులు
భీమవరం పట్టణంలోని సీతయ్య హోటల్ వద్ద స్కూటీ డిక్కీలో ఉన్న 4 లక్షల రూపాయలను దొంగలు ఎత్తుకు పోయారు.
పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి తన కుర్రాళ్లకు రూ.4 లక్షలు ఇచ్చి బ్యాంకులో వేయమని చెప్పగా బ్యాంక్ టైం… pic.twitter.com/ZVaonbROj2