Bhadrachalam: రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఎగువ నుంచి వస్తోన్న వరదతో భద్రాచలం వద్ద నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. నిన్న 39 అడుగుల వద్ద గోదావరి వద్ద నీటి మట్టం ఉంది. ఈ రోజు ఉదయానికి 40 అడుగులకు చేరింది. మధ్యాహ్నం వరకు అది 44 అడుగులకు చేరింది. భద్రాచలం ఎగువన గల తాలిపేరు ప్రాజెక్టు నుంచి 23 గేట్లు ఎత్తారు. 1,80,000 క్యూసెక్కుల నీటిని దిగువన గల గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.
భద్రచాలం (Bhadrachalam) వద్ద గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరితి మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేస్తారు. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. భద్రాచలం (Bhadrachalam) వద్ద నీటి మట్టం ఇలానే పెరిగితే రేపు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. నీటి మట్టం పెరగడంతో సమీప ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు.
గోదావరి కరకట్ట ప్రాంతం వద్ద గల విస్తా కాంప్లెక్స్ ఏరియాలో మోటార్ల ద్వారా బ్యాక్ వాటర్ తొలగించే ప్రాంతాన్ని ఎమ్మెల్యే వీరయ్య (veeraiah) పరిశీలించారు. రామాలయం ఏరియాలో గల కొత్త కాలనీలో వరదనీరు చేరకుండా బ్యాక్ వాటర్ మోటార్ల ద్వారా తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.