Peddireddy: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) తడబడ్డారు. ఓ సభలో ఎమ్మెల్యే అభ్యర్థి గురించి కామెంట్స్ చేశారు. సీఎం జగన్ పేరు ప్రస్తావించి మరీ.. నోరుజారారు. ఇటీవల కుప్పంలో సభ జరిగిందట.. అక్కడికి సీఎం జగన్ (jagan) వచ్చారని తెలిపారు. ఆ సభలో సీఎం జగన్ ఇలా అన్నారని పెద్దిరెడ్డి (Peddireddy) వివరించారు.
సభకు వచ్చిన సీఎం జగన్ (jagan).. కుప్పం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి భరత్‌ను గెలిపించాలని కోరారు. అతనిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మంత్రి అనబోయి.. ముఖ్యమంత్రిని చేస్తానని జగన్ అన్నారని తప్పులో కాలేశారు. వచ్చే ఎన్నికల్లో భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఆయన గెలిస్తే మంచి జరుగుతుందని.. పదవీ దక్కుతుందని చెప్పాల్సింది పోయి.. ఏకంగా సీఎంను చేస్తానని జగనే చెప్పారని అనడం చర్చకు దారితీసింది.
కుప్పం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం చేస్తాం అంటూ నోరుజారిన మంత్రి పెద్దిరెడ్డి pic.twitter.com/zrC8uBeHCg
కుప్పం నియోజకవర్గం చంద్రబాబు (chandrababu) కంచుకోట.. ఆయన ఇక్కడి నుంచే గెలుస్తూ వస్తున్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా ఇక్కడి ప్రజలు చంద్రబాబుకే పట్టం కడతారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని వైసీపీ అనుకుంటోంది. ఓ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy) చేసిన కామెంట్స్ ఇందుకు నిదర్శనం. ఏపీలో ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం ఉంది. అయినప్పటికీ పొలిటికల్ డెవలప్ మెంట్స్ స్పీడ్ అందుకున్నాయి. వైసీపీ, టీడీపీ.. జనసేన కూడా యాక్టివ్ అవుతుంది.