వికారాబాద్‌లోని దామగుండం అడవిని కాపాడాలని, రాడార్ స్టేషన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో సేవ్ దామగుండం మూవ్మెంట్ ఉద్యమ నాయకులు, POW రాష్ట్ర ఉపాధ్యక్షుడు గీత ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్, తులసి చందు, పర్యావరణ ప్రేమికులు, తదితరులు పాల్గొన్నారు.