»Telangana Kicks Off Robotics Framework First In Country
Robotics: దేశంలో తొలి రోబోటిక్ ఫ్రేమ్ వర్క్.. తెలంగాణలో..!
దేశంలోనే తొలి రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. తద్వారా రేపటి తరాన్ని అన్ని తానై నడిపించే రోబోటిక్స్ టెక్నాలజీని.. ఇప్పుడే నేటి తరానికి కానుకగా అందించింది.
దేశంలోనే తొలి రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. తద్వారా రేపటి తరాన్ని అన్ని తానై నడిపించే రోబోటిక్స్ టెక్నాలజీని.. ఇప్పుడే నేటి తరానికి కానుకగా అందించింది. మంగళవారం టీ-హబ్‌లో రాష్ట్ర ఐటీ శాఖ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, పౌరుల జీవితాలను మెరుగుపరిచేందుకు సాంకేతిక ఆవిష్కరణలకు మార్గదర్శకంగా నిలుస్తోందని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం సమాజంలో జరిగే చాలా సమస్యలను పరిష్కరించేందుకు రోబోటిక్స్ ఉపయోగపడుతున్నాయని కేటీఆర్ అన్నారు. అభివృద్ధిలో ఐటీ వినియోగం పెంచాలని.. టెక్నాలజీని వాడాలని సూచించారు. రోబోటిక్స్ సాంకేతికత వేగంగా పెరుగుతోందని.. గత మూడు దశాబ్దాల్లో మూడు రెట్లు వాటి వినియోగం పెరిగిందని అన్నారు. ప్రపంచంలోనే భారతదేశం రోబోటిక్స్ వినియోగంలో పదో స్థానంలో ఉందని గుర్తు చేశారు. త్వరలోనే ఐదో స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు