గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ(Srija), అల్లుడు కళ్యాణ్ దేవ్(Kalyan Dev)లు విడిగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరూ అన్ ఫాలో చేసుకోవడంతో వీరి మధ్య వివాదం తలెత్తిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇద్దరూ కలిసున్న ఫోటోలను కూడా వీరు డిలీట్ చేసుకున్నారు. దీంతో విడాకుల వార్తలకు బలం చేకూరినట్లైయ్యింది. గత కొద్ది రోజులుగా ఈ జంట షేర్ చేసే పోస్టులు నెట్టింట వైరల్(Viral) అవుతున్నాయి.
మెగా ఫ్యామిలీ(Mega Family)లో జరిగే ఏ పార్టీలో కూడా కళ్యాణ్ దేవ్(Kalyan Dev) అస్సలు కనిపించడం లేదు. తన కూతుర్లను మిస్ అవుతున్నానంటూ కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ విపరీతంగా వైరల్(Viral) అయ్యింది. శ్రీజ(Srija) కూడా మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ రావడంతో వీరిద్దరి గురించి రూమర్స్ వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలకు సంబంధించి శ్రీజ(Srija) ఇంత వరకూ రియాక్ట్ కాలేదు. ఇద్దరూ కూడా విడిపోవడం గురించి నేరుగా స్పందించలేదు. అయితే వీరు విడిపోయినట్లు పరోక్షంగా హింట్ ఇస్తూ పలు పోస్టులు షేర్ చేస్తున్నారు. తాజాగా కళ్యాణ్ దేవ్(Kalyan Dev) షేర్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది.
ఓ స్కూల్ పాప కల్చరల్ ఈవెంట్లో పాల్గొని స్టేజ్ పై నుంచి తన పేరెంట్స్ ను చూసి సంతోషంలో ఏడుస్తుంది. ఆ వీడియోను కళ్యాణ్ దేవ్(Kalyan Dev) షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చాడు. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, సపోర్టు కచ్చితంగా కావాలి. మిస్సింగ్ నవిష్క, నివిత్రి అంటూ కళ్యాణ్ దేవ్ ఇన్ స్టాలో పోస్టు షేర్ చేశాడు. దీంతో భార్యభర్తలు విడిపోయినా కూడా పిల్లలకు మాత్రం ఇద్దరి ప్రేమ దక్కాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.