»Telangana Commission Of Women Has Serious To Bandi Sanjay
bandi sanjayపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్
bandi sanjay:తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై (bandi sanjay) రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఓ మహిళా పట్ల అలా మాట్లాడతారా అని ఆగ్రహాం వ్యక్తం చేసింది. సంజయ్ (sanjay) వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. కామెంట్ల విషయంలో సంజయ్‌ను (sanjay) విచారించాలని డీజీపీని (dgp) మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి (sunitha laxma reddy) ఆదేశించారు.
telangana commission of women has serious to bandi sanjay
bandi sanjay:తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై (bandi sanjay) రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఓ మహిళా పట్ల అలా మాట్లాడతారా అని ఆగ్రహాం వ్యక్తం చేసింది. సంజయ్ (sanjay) వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. కామెంట్ల విషయంలో సంజయ్‌ను (sanjay) విచారించాలని డీజీపీని (dgp) మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి (sunitha laxma reddy) ఆదేశించారు. వ్యాఖ్యలకు సంబంధించి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని బండి సంజయ్‌కు (sanjay) నోటీసులు కూడా జారీచేశారు. ఇదే అంశంపై జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ రాయనుంది.
బండి సంజయ్ (sanjay) వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు (brs leaders) ఫైర్ అవుతున్నారు. ఆయన దిష్టిబొమ్మ దగ్దం చేశారు. సంజయ్ (sanjay) వెంటనే కవితకు (kavitha) క్షమాపణలు చెప్పు అని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్‌పై (sanjay) కేసులు నమోదవుతున్నాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో దానం నాగేందర్ (danam nagender), జూబ్లీహిల్స్ పీఎస్‌లో మాగంటి గోపినాథ్ (maganti gopinath) , వనస్థలిపురం, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, బేగంపేట సహా చాలా పోలీస్ స్టేషన్లలో సంజయ్ కుమార్‌పై కేసు నమోదయ్యాయి.
ఎమ్మెల్సీ కవితను (kavitha) ఈ రోజు ఈడీ అధికారులు విచారిస్తోన్న సంగతి తెలిసిందే. మార్చి 8వ తేదీన హైదరాబాద్‌లో గల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు (International Women’s Day) నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (sanjay) కవిత ఈడీ విచారణ అంశంపై స్పందించారు. కవిత బతుకమ్మ (Bathukamma) పేరుతో తెలంగాణ సాంస్కృతిని దెబ్బ తీసింది. చెప్పులు, హ్యాండ్ బ్యాగులు పెట్టించి కృతిమ పూలు, డీజే పాటలతో బతుకమ్మ అడించి విలువ తీసేసింది. కవితను (kavitha) అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా? కేసీఆర్ (kcr) కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్ అన్నారు. ఈ కామెంట్స్ ఆలస్యంగా వెలుగుచూశాయి. సంజయ్ (sanjay) కామెంట్లను బీఆర్ఎస్ నేతలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.