KMM: తిరుమలాయపాలెంలో శుక్రవారం ఘోరం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తోటమల్ల నాగభూషణం తన భార్య జయమ్మ నిద్రిస్తుండగా ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను కూడా పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగభూషణం అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన జయమ్మను చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.