Tarun Chugh : బండి సంజయ్ అరెస్ట్ ను ఖండించిన తరుణ్ చుగ్
తెలంగాణ (Telangana)లో టీఎస్ పీఎస్సీ (TSPSC) ప్రశ్నాపత్రములు లీక్ కావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జీ తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారంపై హైదరాబాద్ గన్ పార్క్(Hyderabad Gun Park) వద్ద శాంతియుత నిరసన చేపట్టిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను(Bandi Sanjay) అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తరుణ్ చుగ్(Tarun Chugh) ఖండించారు.
తెలంగాణ (Telangana)లో టీఎస్ పీఎస్సీ (TSPSC) ప్రశ్నాపత్రములు లీక్ కావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జీ తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారంపై హైదరాబాద్ గన్ పార్క్(Hyderabad Gun Park) వద్ద శాంతియుత నిరసన చేపట్టిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను(Bandi Sanjay) అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తరుణ్ చుగ్(Tarun Chugh) ఖండించారు. మహిళలను సైతం విచక్షణారహితంగా కొట్టారని మండిపడ్డారు. లాఠీఛార్జీలో పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన అన్నారు.
బండి సంజయ్ ని అరెస్ట్ చేసో, ప్రజలపై దౌర్జన్యానికి పాల్పడో పేపర్ లీకేజ్ స్కామ్ (Paper leakage scam) నుంచి బయటపడొచ్చని సీఎం కేసీఆర్(CM KCR) భావిస్తే అది ఆయన అవివేకమే అవుతుందని అన్నారు. ఈ అంశంపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత వల్ల ఉద్యోగాల కోసం చూస్తున్న వేలాది మంది భవిష్యత్తు నాశనమయిందని చెప్పారు. కేసీఆర్ మోసాన్ని ప్రజల ముందు బీజేపీ (BJP) నగ్నంగా బయటపెడుతుందని అన్నారు. కేసీఆర్ కుటుంబం భారీ మూల్యం చెల్లించుకునే రోజు ఎంతో దూరం లేదని చెప్పారు.