»Shock For Brs Allotment Of Gas Cylinder Symbol To Trs
TRS Party: బీఆర్ఎస్కు షాక్.. టీఆర్ఎస్కు ‘గ్యాస్ సిలిండర్’ గుర్తు కేటాయింపు
బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ షాకివ్వనుంది. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సిలిండర్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఓటర్లు ఓటు వేసే సమయంలో కొంత తికమకపడే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections) ముందు టీఆర్ఎస్ (TRS) పార్టీకి షాక్ తగిలింది. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇలాంటి తరుణంలో ఎన్నికల సంఘం కూడా టీఆర్ఎస్కు వేరే గుర్తును కేటాయించడంతో పార్టీ నేతలు అయోమయంలో పడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం కామన్ సింబల్‌గా గ్యాస్ సిలిండర్ గుర్తును (Gas Cylinder Symbol) కేటాయించినట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఇదే గుర్తుతో ఈసారి టీఆర్ఎస్ పోటీ చేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) ఇప్పుడు మరో టెన్షన్ మొదలైంది.
గతంలో టీఆర్ఎస్ (TRS)గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rastra Samiti) గత ఏడాది దసరా (Dasara) నుంచి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించింది. దీంతో ఆ పార్టీ భారత రాష్ట్ర సమితిగా (Bharata Rastra Samiti) పేరు మార్పు చెేసింది. ఇకపోతే సిద్దిపేట జిల్లా పొన్నాలకు చెందిన తుపాకుల బాలరంగం తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్)తో కొత్త పార్టీని రిజిస్టర్ చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేయనుంది. ఎన్నికల సంఘం నిబంధల మేరకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు అన్ని స్థానాల్లోనూ సిలిండర్ గుర్తును ఈసీ కేటాయించింది.
మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao)కు సన్నిహితుడుగా తుపాకుల బాలరంగం సుపరిచితుడే. ఆయన స్వగ్రామం సిద్ధిపేట జిల్లా పొన్నాల కావడంతో 1983 నుంచి ఆయన కేసీఆర్‌తో ఉంటూ వస్తున్నారు. బాలరంగం 1987లో, 1995లో పొన్నాల సర్పంచ్‌గా కూడా గెలిచారు. ఆ తర్వాత 2001లో సిద్ధిపేట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా, 2006లో జడ్పీటీసీగా, 2019 నుంచి 2021 వరకూ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. టీఆర్ఎస్ (TSR) పేరుతో ఆయన పార్టీని పెట్టడం వల్ల ఇప్పుడు బీఆర్ఎస్కు కొత్త చిక్కొచ్చి పడింది.