»Congress Leader Rahul Gandhis Us Trip Schedule Changed In Nizamabad Bodhan
Rahul gandhi: బస్సు యాత్రలో మార్పులు
తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర షెడ్యూల్లో మార్పులు జరిగాయి. ఈ క్రమంలో రేపు బోధన్, నిజామాబాద్‌లో జరగనున్న బస్సు యాత్రను క్యాన్సిల్ చేశారు. అయితే అత్యవసరంగా రాహుల్ ఢిల్లీ వెళ్లనున్న క్రమంలో ఈ మేరకు అనౌన్స్ చేశారు.
four months new Bride suicide Relatives are suspect with husband at palnadu
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బస్సు యాత్రలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రేపు బోధన్, నిజామాబాద్‌లో నిర్వహించనున్న బస్సు యాత్రను రద్దు చేశారు. అయితే అత్యవసర సమావేశం ఉండటంతో ఢిల్లీకి రాహుల్ గాంధీ వెళ్లనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో తిరిగి బస్సు యాత్రను షెడ్యూల్ చేయనున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ‘విజయభేరి బస్సుయాత్ర’ అక్టోబర్ 18న ములుగులోని రామప్ప ఆలయం నుంచి ప్రారంభమైంది. రామప్ప ఆలయంలో శివుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలోనే తెలంగాణలో మొదటదశలో రాహుల్ గాంధీ యాత్ర మూడు రోజులు జరుగుతుందని ప్రకటించారు. అక్టోబర్ 18 నుంచి 20 వరకు కొనసాగుతుందని ప్రకటించారు. రాహుల్ మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో తొలి దశను పూర్తి చేస్తారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ప్రస్తుతం అక్టోబర్ 19న రాహుల్ గాంధీ పెద్దపల్లి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాల్గొన్నారు. కానీ రేపు అక్టోబర్ 20న బోధన్, నిజామాబాద్‌లలో జరిగే పాదయాత్ర రద్దైనట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.