»One And A Half Lakh Bribe For Building A House In Hyderabad Acb Caught Ghmc Officer
Bribe: హైదరాబాద్లో ఇల్లు నిర్మాణం కోసం లక్షన్నర లంచం..పట్టుకున్న ఏసీబీ
హైదరాబాద్లో మీరు ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే పర్మిషన్ కోసం లక్ష రూపాయలు రెడీ చేసుకోండి. అదెంటీ అనుమతి కోసమే అంత అమౌంట్ ఇవ్వాలా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే తాజాగా సరూర్ నగర్ పరిధిలో ఓ అధికారి ఇదే విషయంలో లక్షన్నర లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
One and a half lakh bribe for building a house in Hyderabad ACB caught ghmc officer
హైదరాబాద్ సరూర్ నగర్(saroornagar) పరిధిలో గతంలో అనేక మంది అధికారులు అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. అయినా కూడా ప్రస్తుత అధికారుల తీరులో మార్పు రాలేదు. మళ్లీ అదే తీరు. లంచం లంచం లంచం. ఇల్లు కట్టుకోవాలన్నా లంచమే, పర్మిషన్ ఇవ్వాలన్నా లంచమే. ఈ నేపథ్యంలోనే
ఇద్దరు అధికారులు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
సరూర్ నగర్లోని GHMC ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో హయత్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ఉమతోపాటు అదే విభాగంలో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగి లక్ష్మణ్ ను అనిశా(ACB) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం గుర్రంగూడకు చెందిన సుధాకర్ రెడ్డి తన ఇంటి నిర్మాణం కోసం టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ఉమను కలిశారు. ఆ క్రమంలో ఆమె అనుమతి కోసం లక్షన్నర రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ప్లాన్ ప్రకారం బాధితుడి నుంచి డబ్బులు ఇస్తున్న క్రమంలో ఏసీబీ వారిని పట్టుకుంది. ఇది తెలిసిన పలువురు అధికార ప్రభుత్వంలో ఏ పని కావాలన్న డబ్బులు ఇవ్వాల్సిందేనని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ అధికారుల తీరు ఇలా ఉందని అంటున్నారు.