»Revanth Reddy Will You Tie The Saree Will You Tie It To Rahul Gandhi Ktrs Sensational Tweet
KTR: రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకుంటావా చీర? రాహుల్ గాంధీకి కట్టిస్తావా?
కేటీఆర్ చీరకట్టుకొని బస్సు ఎక్కు.. ఏ కండెక్టర్ అన్నా టికెట్ తీసుకుంటాడేమో అడుగు అన్న రేవంత్ మాటలకు అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం.. చేసేదేమో సోనియమ్మ జపం అంటూ ఎద్దేవా చేశారు.
Revanth Reddy will you tie the saree? Will you tie it to Rahul Gandhi? KTR's sensational tweet
KTR: “రేవంత్ రెడ్డి.. నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా” అంటూ సంచలనమైన పోస్టు చేశాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ంట్, మాజీ మంత్రి కేటీఆర్. నిర్మల్ సభలో తెలంగాణ సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు అన్ని అబద్దాలు మాట్లాడుతున్నారు. ఆరు పథకాలు అమలు కాలేదని ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని అంటూ.. కేటీఆర్‌ను చీర కట్టుకొని బస్సు ఎక్కమని, టికెట్ అడిగుతారేమో చూడమని మాట్లాడారు. అంతే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఏ తీర్థయాత్రకు అన్నా వెళ్లమని అన్నారు. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ అంతే స్థాయిలో మండిపడ్డారు.
‘‘రేవంత్ రెడ్డి, నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా? తెలంగాణాలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 యేండ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు. వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెసుని బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలే.. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం అని, చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం కేసిఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, కల్యాణ లక్ష్మి నిలిచింది, తులం బంగారం అడ్రస్ లేదు. ఫ్రీ బస్సు అని బిల్డప్, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్ కు మహిళల ఓట్లడిగే హక్కు లేదని, చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదు అని అందరికి తెలిసిపోయింది.” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అదే సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణ ఆడబిడ్డలకు రూ. 2500 ఇస్తున్నట్లు చెప్పారు.