• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘సమస్యల పరిష్కారమే గ్రీవెన్స్ డే లక్ష్యం’

SRCL: బాధితుల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి 18 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.

October 6, 2025 / 05:44 PM IST

స్థానిక ఎన్నికలలో అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ

MBNR: రాబోవు స్థానికసంస్థల ఎన్నికలలో కౌకుంట్ల మండలంలోని అన్నిస్థానాలలో బీజేపీ పోటీచేస్తున్నట్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. హామీలను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

October 6, 2025 / 05:43 PM IST

BRSలో చేరిన వివిధ పార్టీల నాయకులు

ASF: పెంచికల్ పేట్ మండలం కమ్మర్ గాం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు సోమవారం BRSలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోనప్ప మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. మళ్ళీ BRS ప్రభుత్వం రావాలనిప్రజలుకోరుకుంటూన్నారని పేర్కొన్నారు.

October 6, 2025 / 05:40 PM IST

రేపు ముఖ్యనేతల సమావేశం

NRML: త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భైంసా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫాక్టరీలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆధ్వర్యంలో ముఖ్యనేతల సమావేశం నిర్వహించనున్నారు. ముధోల్, లోకేశ్వరం, తానూర్, బాసర, మండలాల నాయకులు, కార్యకర్తలు తప్పకుండా పాల్గొనాలని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు.

October 6, 2025 / 05:36 PM IST

నాగార్జునసాగర్ బీసీ డిగ్రీ కళాశాల తరలింపు తాత్కాలికమే

NLG: నాగార్జునసాగర్‌లోని బీసీ గురుకుల విద్యాలయంలో నిర్వహిస్తున్న డిగ్రీ కళాశాలను తాత్కాలికంగా నిడమనూరుకి తరలిస్తున్నామని గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఇటీవల పైలాన్ కాలనీలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాల భవనాన్ని పరిశీలించడం జరిగింది. కానీ అది శిథిలావస్థకు చేరడంతో అక్కడ విద్యార్థులకు సురక్షితం కాదని అక్కడ నూతన భవన నిర్మాణం జరిగే వరకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.

October 6, 2025 / 05:34 PM IST

‘లౌకిక పార్టీలతో స్థానిక ఎన్నికల అవగాహన’

BDK: చర్ల మండలం బీఎస్ రామయ్య భవన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలగాని బ్రహ్మచారి పాల్గొని మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసివచ్చే వామపక్ష ప్రజాతంత్ర లౌకిక పార్టీలతో స్థానిక ఎన్నికల అవగాహన కుదుర్చుకుంటామని అన్నారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కొంత గందరగోళంగా ఉందని ఆయన తెలిపారు.

October 6, 2025 / 05:30 PM IST

అంబేద్కర్ విగ్రహానికి వినతి

BHNG: స్థానిక ఎన్నికల్లో రాజాపేట మండలం పాముకుంటకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ.. సోమవారం గ్రామ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా కలెక్టర్ హనుమంతరావు, తహసీల్దార్ అనిత, ఎంపీడీవో నాగవేణికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇప్పటివరకు గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ కల్పించలేదని పేర్కొన్నారు.

October 6, 2025 / 05:29 PM IST

సమగ్ర ఎన్నికల నిర్వహణపై అవగాహన

MDK: ఎన్నికలు ప్రారంభం నుంచి ముగింపు వరకు సమర్థవంతంగా నిర్వహణపై సిబ్బంది సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ IDOCలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీవోలు ఆల్ నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

October 6, 2025 / 05:27 PM IST

ప్రజా దర్బార్ నిర్వహించిన ఐటీడీఏ సహాయ అధికారి

BDK: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయానికి వివిధ సమస్యల గురించి గిరిజనులు విన్నవించిన దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ అధికారిక పనులపై వెళ్లి అందుబాటులో లేనందున తన ఛాంబర్‌లో యూనిట్ అధికారుల సమక్షంలో అర్జీలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

October 6, 2025 / 05:27 PM IST

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన MLA

JN: దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త పరిదిలు యాదయ్య సతీమణి అంజమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న MLA యశస్విని రెడ్డి సోమవారం మృతురాలు ఇంటికి వెళ్లారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.

October 6, 2025 / 05:27 PM IST

బాత్రూంలో జారిపడి యువకుడి మృతి

MBNR: బాత్రూంలో జారిపడి ఏనుగొండకు చెందిన యువకుడు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. యువకుడు బాత్రూంలో జారి పడగా కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు యువకుడు మృతి చెందినట్లు వెల్లడించారు. దాంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

October 6, 2025 / 05:26 PM IST

బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడం నీచం: అశోక్

NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు కేటాయించిన 42% రిజర్వేషన్లను కోర్టుల ద్వారా అడ్డుకోవాలని చూడడం నీచమైన చర్య అని BC యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ ఇవాళ మండిపడ్డారు. జనాభాలో BCలు 62%ఉన్నా, ప్రభుత్వం కేవలం 42%రిజర్వేషన్లకే అంగీకరించిందని గుర్తు చేశారు. కొంతమంది అగ్రవర్ణాలు కడుపుమంటతోనే ఈరిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

October 6, 2025 / 05:22 PM IST

విద్యా బోధనకు అధ్యాపకుల దరఖాస్తుల ఆహ్వానం

KNR: శంకరపట్నం మండలంలోని మోడల్ స్కూల్/కాలేజీలో గంటల ప్రాతిపదికన బోధించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రభాకర్ తెలిపారు. పీజీటీ తెలుగు, ఇంగ్లీష్, ఎకనామిక్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. పీజీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని,ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

October 6, 2025 / 05:21 PM IST

‘క్రమశిక్షణతో అధికారులు ఎన్నికలను నిర్వహించాలి’

JGL: ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి స్థానిక ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా, నిబద్ధతతో, క్రమశిక్షణతో అధికారులు ఎన్నికలను నిర్వహించాలని అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు క్షేత్ర స్థాయిలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని S.K.N.R డిగ్రీ కాలేజ్‌లో ఆర్వో,వీఆర్వోలకు సమావేశం ఏర్పాటు చేశారు.

October 6, 2025 / 05:18 PM IST

నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సాయం

JGL: జగిత్యాల పట్టణానికి చెందిన నిరుపేద కుటుంబం వాసాల సతీష్ కుమార్ కుమార్తె శ్రీజకు (B.TECH 4th year) పై చదువుల నిమిత్తం గుప్త ధాత ద్వారా పద్మశాలి సేవా సంఘం వారిచే రూ.10000 ఆర్టిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

October 6, 2025 / 05:14 PM IST