BDK: పాల్వంచ RTC బస్ స్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. చెట్ల కింద ప్రయాణికులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన బెంచ్‌లను తొలగించి ఎండలో పడేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎండాకాలంలో ప్రయాణికులు చెట్ల నీడలో వేచి ఉండే సౌకర్యం పూర్తిగా లేకుండా పోయింది. కనీసం టూ వీలర్ కార్లు ఆపడానికి కూడా సౌకర్యం లేదన్నారు.