నల్గొండ జిల్లా పరిధిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎఫ్ఎస్ఈ, ఎస్ఎస్ఈ బృందాలు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఉదయాదిత్య భవనంలో వ్యయ నిర్వహణ కమిటీలు, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్‌వైలెన్స్ బృందాలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.
NZB: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి వివిధ రూపాల్లో చిన్నారులు ఆకట్టుకున్నారు. NZB జిల్లా కేంద్రంలోని గోనెరెడ్డి సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ మందిరంలో నెలకొల్పిన దుర్గామాత మందిరం వద్ద అమ్మవారి వివిధ అలంకరణల్లో చిన్నారులు అలరించారు. బుధవారం సాయంత్రం మండపం వద్ద హోమం, కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వాములు అంతిరెడ్డి విజయపాల్ రెడ్డి ఉన్నారు.
MBNR: ఉమ్మడి జిల్లా గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు SBI RSETY ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 6వ తేదీ వరకు ఉచిత CCTV కెమెరా ఇన్ స్టాలెషన్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గలవారు బండమీదిపల్లి ఆర్ సెట్వై కేంద్రంలో 9963369361, 9542430607 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
KNR: చొప్పదండి పట్టణం జడ్పీహెచ్ఎస్ క్రీడా మైదానంలో రామ్ లీలా కార్యక్రమం ఏర్పాట్లను బుధవారం ఎస్సై నరేష్ రెడ్డి, హిందూ ఉత్సవ సమితి నాయకులు పరిశీలించారు. ఉత్సవ సమితి కన్వీనర్ మహేష్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వీహెచ్పీ అధ్యక్షుడు కృష్ణ, వ్యవస్థా ప్రముఖ్ సత్యనారాయణ, ఉత్సవ సమితి పాల్గొన్నారు.
GDWL: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 3,31,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో, అధికారులు 18 గేట్లను ఎత్తివేశారు. గేట్ల ద్వారా 2,96,244 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 318 మీటర్లు కాగా, గురువారం 317 మీటర్ల కలవన్నారు.
MNCL: బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో నేడు నిర్వహించనున్న రామ్ లీలా కార్యక్రమానికి పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని CI శ్రీనివాస్ తెలిపారు. ప్రజలంతా పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. కాంటా చౌరస్తా నుంచి కన్నాలబస్తి ఫ్లైఓవర్ వరకు వాహనాల రాకపోకలను నిషేధించినట్లు చెప్పారు. కార్యక్రమం అనంతరం బయటికి వెళ్లడానికి 3 గేట్లు ఏర్పాటు చేశామన్నారు.
MBNR: గండీడ్ మండలంలోని రంగారెడ్డిపల్లి వద్ద బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొని రామాంజి (48)అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బీఎస్ఎన్ఎల్ కేబుల్ పనులు ముగించుకొని నడుచుకుంటూ వెళుతున్న రామాంజిని, తాండూర్ వైపు వెళ్తున్న బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో అతడికి రెండు కాళ్లు విరిగిపోయాయి. స్థానికులు సమాచారం మేరకు 108 సిబ్బంది బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
SDPT: విజయదశమి సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం శమీ పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద గాంధీ జయంతి, శివాలయంలో నిర్వహించే శమీ పూజకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద రామ్ లీలా దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం తెలిపింది.
HYD: విజయదశమితో పాటు గాంధీ జయంతి పురస్కరించుకొని నేడు సాలార్ జంగ్ మ్యూజియం మూసి ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సాలార్ జంగ్ మ్యూజియం చూసేందుకు వచ్చే పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు. తిరిగి యధావిధిగా శుక్రవారం నుంచి మ్యూజియం తెరిచి ఉంటుందని తెలిపారు.
NLG: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణవార్త తెలిసి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దామోదర్ రెడ్డితో తనకున్న సన్నిహిత అనుబంధం ఎప్పటికీ మరువలేనిదని, ఆయన అందించిన స్ఫూర్తి, స్నేహం తన జీవితంలో ఎంతో ప్రత్యేకత అని గుర్తు చేసుకున్నారు.
SRPT: ఎన్నికల సందర్భంగా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 35 మందిని బైండోవర్ చేసినట్లు సీఐ చరమంద రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
SRCL: రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నియమవారిని పాటించాలని ఎంపీడీవో రాధా అన్నారు. చందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మోడల్ కూడా కండక్ట్‌పై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల్లో ఏమిచేయాల్సినవి, చేయకూడనవి ఏంటనేది వివరించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రజలందరికీ విజయ దశమి పండుగ సందర్భంగా వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. దుష్ట శక్తులపై విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలందరూ ఐక్యత, సమగ్రత కోసం కృషి చేయాలన్నారు. ఈ సంవత్సర కాలంలో వారి కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ADB: ప్రభుత్వం అందజేసే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్య అధికారి డా. నిఖిల్ రాజ్ తెలిపారు. భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పలు గ్రామాల్లో బుధవారం వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను అందజేశారు. వైద్య విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్, సిబ్బంది తదితరులున్నారు.
MBNR: దసరా పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని హన్వాడ ఎస్సై వెంకటేష్ బుధవారం సాయంత్రం తెలిపారు. హన్వాడ మండల పరిధిలో నిరంతరం పెట్రోలింగ్ కొనసాగుతుందని, మద్యం తాగి వాహనాలు నడప రాదని, ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటించాలన్నారు. పండుగ వేళ అందరూ స్నేహభావంతో, సోదరభావంతో ఆరోగ్య కరమైన వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలన్నారు.