• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

DSP ఉద్యోగం సాధించిన మౌనికకు ఘనంగా సన్మానం

WGL: నర్సంపేట పట్టణ పరిధిలో వడ్డెర కులస్తులు గ్రూప్‌ వన్‌లో తెలుగులో పరీక్ష రాసి DSP ఉద్యోగం సాధించిన మౌనికను వడ్డెర కుల పెద్దలు ఘనంగా సన్మానించారు. నర్సంపేట పట్టణ పరిధిలోని వడ్డెర కాలనీలో నివసించే మౌనిక కృషి, పట్టుదలతో ఈ విజయాన్ని సాధించిందని కుల పెద్దలు అభినందించారు. యువతకు మౌనికను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

September 29, 2025 / 05:35 PM IST

నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

NRML: దుర్గాదేవి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని వినాయక సాగర్ చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దుర్గాదేవి నిమర్జనానికి సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాటు చేయాలని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

September 29, 2025 / 05:34 PM IST

‘స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి’

KNR: రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ లోకల్ బాడీ ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతూ.. ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ వివరాలను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సత్పతి నిర్వహించారు.

September 29, 2025 / 05:32 PM IST

జర్నలిస్టులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది: సీతక్క

HYD: జర్నలిస్టులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ కార్డులు అందజేసేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.

September 29, 2025 / 05:31 PM IST

‘హైకోర్టు తీర్పు మేరకు నష్టపరిహారం చెల్లించండి’

మహబూబ్‌నగర్ రూరల్ మండలం దివిటిపల్లి గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి ఆయా ప్రాంతాల రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం విషయంలో హైకోర్టు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తమకు నష్టపరిహారం చెల్లించాలని దివిటిపల్లి గ్రామస్తులు సోమవారం అధికారులకు వినతి పత్రం సమర్పించారు.

September 29, 2025 / 05:29 PM IST

బతుకమ్మ వేడుకలకు సిద్దమైన మహిళలు

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని కార్మిక కాలనీలతో పాటు, గ్రామాలలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా సోమవారం తీరొక్క పూలతో ఉత్సవాలకు మహిళలు రంగురంగుల బతుకమ్మలను సిద్ధం చేశారు. సహజంగా లభించే అన్ని రకాల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. నియోజకవర్గంలోని 7 మండలాలలో వేడుకలను ఘనంగా జరిపేందుకు మహిళలందరూ ఉత్సాహం చూపుతున్నారు.

September 29, 2025 / 05:29 PM IST

దుర్గామాత దేవిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

BDK: మణుగూరు పట్టణంలోని సుందరయ్యనగర్‌లో ఏర్పాటు చేసిన దుర్గామాత దేవి మండపాన్ని సోమవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సందర్శించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం..మాజీ ఎమ్మెల్యే రేగాను అమ్మవారి కమిటీ సభ్యులు సత్కరించారు. భవిష్యత్తులో ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించాలని రేగ కాంతారావు తెలిపారు.

September 29, 2025 / 05:27 PM IST

గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు

SRCL: తంగళ్ళపల్లి మండలంలోని కొన్ని గ్రామాలలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడుతూ తమ భక్తిని చాటుకున్నారు. మండల కేంద్రంలోని కొన్ని గ్రామాలలో రేపు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తుండగా, మరికొన్ని గ్రామాలలో ఇవాళే సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మ ఆడి నిమజ్జనం చేశారు.

September 29, 2025 / 05:22 PM IST

హమాలీలకు బోనస్ అందజేత

BHNG: దసరా పండుగను పురస్కరించుకుని జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ జీ.వీరారెడ్డి జిల్లాలో ఉన్న పౌరసరఫరాల సంస్థ గోదాంలో పనిచేస్తున్న. 91 మంది హమాలీలకు, 5 మంది స్వీపర్సలకు దసరా బోనస్ ఒకరికి రూ.7500 చొప్పున రూ.900 ల విలువ గల స్వీట్ బాక్సులను సోమవారం అందజేశారు. ప్రతి ఒక్క హమాలీకి 2 జతల బట్టలు, స్వీపర్స్‌లకు 2 జతల చీరలు దసరా పండగ సందర్బంగా అందజేశారు.

September 29, 2025 / 05:22 PM IST

నేటి నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు

MDK: రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందని, నేటి నుంచి జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. కౌడిపల్లి మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లను పరిశీలించారు. స్థానిక ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.

September 29, 2025 / 05:22 PM IST

‘విద్యుత్ సంస్థలో ఉద్యోగులు,ఆర్టిజన్స్ సమస్యలు పరిష్కరించాలి’

BDK: ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి సోమవారం పాల్వంచ మండలంలో పర్యటించారు. KTPS,TRVKS ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం TRVKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీ హాజరయ్యారు. విద్యుత్ సంస్థలో ఉద్యోగులు, ఆర్టిజన్స్ ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య పరిష్కరించాలని ఎంపీని వారు కోరారు.

September 29, 2025 / 05:22 PM IST

‘సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు భరోసా’

BHNG: నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సోమిరెడ్డి అన్నారు. సోమవారం మోత్కూర్‌కు మున్సిపల్ కేంద్రానికి చెందిన బొల్లెపల్లి చంద్రయ్యకు రూ.60వేలు, మొగుళ్ళ శ్రీనివాస్ రెడ్డికి రూ.60వేల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగొని రామచంద్రు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

September 29, 2025 / 05:21 PM IST

సొంత నిధులతో డ్రైనేజీ కల్వర్టును నిర్మించిన మాజీ కౌన్సిలర్

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని పాలకొండ డివిజన్‌లో మాజీ కౌన్సిలర్ మూస నరేందర్ తన సొంత నిధులతో వార్డు పరిధిలో నూతనంగా డ్రైనేజీ కల్వర్టును నిర్మించారు. ఈ సందర్భంగా నేడు ఆయన మాట్లాడుతూ.. వాడు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన రాకుండా కూడా తన సొంత డబ్బులతో ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇచ్చిన హామీని పూర్తి చేస్తానన్నారు

September 29, 2025 / 05:21 PM IST

రూరల్ MLAకి మాతృవియోగం

NZB: రూరల్ MLA భూపతి రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఎమ్మెల్యే మాతృమూర్తి రేకులపల్లి లక్ష్మీ నరసమ్మ సోమవారం మధ్యాహ్నం మరణించారు. ఆమె అంత్య క్రియలు రేపు ఉదయం 10.30 గంటలకు గూపన్పల్లి వైకుంఠ ధామంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం సంతాపం ప్రకటించారు.

September 29, 2025 / 05:20 PM IST

‘వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి’

KNR: ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఆందోళన, వ్యాధులు పెరిగాయని.. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ హృదయ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రిలో నగరంలోని రెనె హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఈసీజీ, 2డి ఏకోస్క్రీనింగ్ నిర్వహించారు.

September 29, 2025 / 05:19 PM IST