PDPL: రామగుండం రైల్వే స్టేషన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇట్టి పాండి, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సిపాలి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా డివిజనల్ రైల్వే యూజర్స్ కమిటీ సభ్యుడు అనుమాస శ్రీనివాస్ టాయిలెట్ నిర్మాణం సహా పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.
సిద్దిపేట నుంచి హనుమకొండ ప్రయాణించిన శోభారాణి అనే మహిళ నాలుగు తులాల బంగారం ఉన్న బ్యాగును బుధవారం ఆర్టీసీ బస్సులో మర్చిపోయింది. హనుమకొండలో దిగిన తరువాత ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆర్టీసీ అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు ఆ బ్యాగును హుస్నాబాద్ బస్టాండ్లో స్వాధీనం చేసుకుని, సురక్షితంగా మహిళకు అందించారు.
KNR: నిజామాబాద్‌లో ఈనెల రెండవ వారంలో జరిగే ఎసీఎఫ్ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు చొప్పదండి జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఎంపికైనట్లు పీడీ కృష్ణ బుధవారం తెలిపారు. విద్యార్థులు కే. సౌమ్య, పీ. కాశీ విశ్వనాథ్ గత నెల జగిత్యాలలో జరిగిన ఉమ్మడి జిల్లా తైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని వివరించారు.
SDPT: జిల్లా ప్రజల భద్రత, రక్షణకు పెద్దపీట వేస్తామని, మరింత మెరుగైన సేవలు అందిస్తామని సీపీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి, కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పాటించి, ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు సమన్వయం పాటించాలని సూచించారు. బెల్ట్ షాపులు, పేకాట, డ్రగ్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
NZB: ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లా కార్యాలయంలో బుధవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం జరిగింది. లక్ష్యాలు, ప్రగతి, వచ్చే సీజన్‌లో రైతాంగానికి అందిచాలన్నారు.
MDK: పిల్లలు, మహిళలకు ఆరోగ్యకరమైన పోషకాహారం అందించడమే పోషణ అభియాన్ ప్రధాన లక్ష్యమని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శ్రీశైల అన్నారు. పోషణ పక్వాడలో భాగంగా టేక్మాల్ మండలం ఎల్లుపేట సెక్టార్లోని నల్లకుంట తండాలో అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పోషకాహారాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
SRPT: టీసేఫ్ యాప్‌పై విద్యార్థులు, మహిళలు అవగాహన కలిగి ఉండాలని షీటీమ్ ఎస్సై మల్లేష్ అన్నారు. మఠంపల్లి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు షీ టీమ్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ… విద్యార్థులు సామాజిక మాధ్యమాలు, గంజాయికు దూరంగా ఉండాలని తెలిపారు. మహిళలు వేధింపులకు గురైతే 871288606 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
ADB: నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి ప్రతి రోజు త్వరగా రిపోర్టును పంపించాలని కలెక్టర్ రాజర్షి షా బుధవారం అధికారులకు సూచించారు. సంబంధిత వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను అప్‌లోడ్ చేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ చివరి సమయంలో, విత్ డ్రా సమయాల్లో వీడియో చిత్రీకరణ చేయిస్తే అవి తగిన ఆధారాలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
SRD: పత్తి రైతులు ప్రభుత్వ మద్దతు ధర పొందాలంటే మొబైల్‌లో కపాస్ కిసాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఖేడ్ ADA నూతన్ కుమార్ బుధవారం తెలిపారు. ప్రతి రైతు ఈ యాప్‌లో రైతు వివరాలు, ఏయే పంటలు వేశారో నమోదు చేయాలన్నారు. పత్తి అమ్మే సమయంలో ఈ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే, ప్రభుత్వ మద్దతు ధర వర్తిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SRCL: రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించాలని, రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో బుధవారం రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. రైతులు డిజిటల్ వ్యవసాయం మట్టి పరీక్షలు నీటి నిర్వహణ పంటల వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనలు పాటించాలన్నారు.
MNCL: తాండూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్ జోష్ణ, రెవెన్యూ సిబ్బందితో మాట్లాడారు. ‘భూ భారతి’ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, పెండింగ్‌లో ఉన్నవాటిని త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.
SRD: పటాన్‌చెరు మహాప్రస్థానంలో అచ్చమ్మ జ్ఞాపకార్థంగా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మోటార్ వాటర్ ట్యాంక్, జల్లు వ్యవస్థ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, ప్రస్తుత కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రుద్రభూమి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కూన అప్పారావు తదితరులు ఉన్నారు.
NLG: ప్రపంచ స్కిల్ కాంపిటీషన్‌లో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి యువత ఈ నెల15లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి పద్మ ఇవాళ తెలిపారు. 6- 24 ఏళ్ల వయస్సు వారు,నైపుణ్యం కలిగి నిరక్షరాస్యులైన వారు కూడా అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు http://www.skillindiadigital.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
SRD: పుల్కల్ మండలం సింగూర్ జలాశయంలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు 30,410 క్యూసెక్కుల వరద వచ్చి చేరినట్లు AEE స్టాలిన్ తెలిపారు. గత మూడు రోజుల నుంచి వరద ప్రవాహం పెరుగుతుండడం వల్ల 4 గేట్లు ఎత్తి దిగువకు 35,750 క్యూసెక్కులు వరదను వదిలి పెట్టినట్లు చెప్పారు. ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 17.791 టీఎంసీలు ఉందని పేర్కొన్నారు.