RR: రేపు గాంధీ జయంతి సందర్భంగా మాంసం విక్రయాలతో పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు దసరా పండుగను పురస్కరించుకొని మద్యం ప్రియులు షాద్‌నగర్ లోని పలు మద్యం దుకాణాలకు పోటెత్తారు. మద్యం దుకాణాలతో పాటు చికెన్, మటన్‌ను కూడా కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
SRCL: విజయదశమి (దసరా) సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ ఎం. హరిత ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ ప్రతి ఇంటా ఆనందోత్సాహాలను నింపాలని ఆకాంక్షించారు. దుర్గాదేవి కృపతో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించాలని, ఈ దసరా అందరికీ విజయాలను చేకూర్చాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
MDK: మనోహరాబాద్ మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు కన్నుల పండుగగా జరుపుకున్నారు. రామాలయం వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కరీంనగర్‌లో అట్టహాసంగా మహిషాసుర సంహారం నిర్వహించారు. మహాశక్తి ఆలయం వద్ద మహిషాసురుడి దిష్టిబొమ్మను కేంద్ర మంత్రి బండి సంజయ్ దహనం చేశారు. ధర్మరక్షణ కోసం చెడుపై మంచి సాధించిన విజయమే దసరా పర్వదినం అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అధర్మానికి, అక్రమాలకు, అరాచకాలకు పాల్పడే వారిపై అంతిమ విజయం ధర్మానిదేకేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
GDWL: గురువారం రేపు జరగనున్న దసరా ఉత్సవాలు జాగ్రత్త వహించాలని గద్వాల్ జిల్లా ఎస్పీ టీ శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితి అయితే పోలీసులను సంప్రదించాలన్నారు. పండుగ పూట గ్రామంలోని మహిళలు ఒంటిపైన భారీ నగలు వేసుకుని బయట తిరగవద్దు అని వాటిని జాగ్రత్తగా గమనించాలని దొంగలు తీసుకెళ్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు కలెక్టర్ హనుమంతరావు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి విజయానికి గుర్తుగా దసరాను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. అందరి జీవితాల్లో విజయాలు సమకూరాలని, తలపెట్టిన కార్యక్రమాలన్నీ సఫలం అవ్వాలని కోరారు. దుర్గామాత అనుగ్రహంతో అందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు.
WGL: అధిక లాభం ఆశ చూపి రూ.కోట్లు మోసం చేసిన గొలుసు కట్టు ముఠా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులతో పాటు సిబ్బందికి ఈరోజు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందుకున్నారు. పత్రాలను అందుకున్న వారిలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ మధుసూదన్, నర్సయ్య, ఇన్స్పెక్టర్లు పవన్ ఉన్నారు.
VKB: ఎన్నికల సమయంలో పంచాయతీ కార్య దర్శులు విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని ధారూర్ మండల పంచాయతీ అధికారి ఇంఛార్జి MPDO షఫీ ఉల్లా ఖాన్ సూచించారు. సమయపాలన పాటించాలని, గ్రామాల్లోని గోడ రాతలు, ఫ్లెక్సీలు వంటి పార్టీల ప్రచారాలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ను ఎవరూ ఉల్లంఘించరాదని ఆయన స్పష్టం చేశారు.
MDK: తూప్రాన్ మండలంలోని పోలింగ్ కేంద్రాలను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తనిఖీ చేశారు. బుధవారం తూప్రాన్ మండలం ఇస్లాంపూర్, కిష్టాపూర్ గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడి పోలీసులకు, అధికారులకు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ సీఐ రంగ కృష్ణ, తూప్రాన్ ఎస్సై శివానందం పాల్గొన్నారు.
NLG: హిందువుల అది పెద్ద పండుగ అయిన విజయదశమి (దసరా) సందర్భంగా నల్గొండ పట్టణంలోని శివారు ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేద హిందూ కుటుంబ సభ్యులకు పట్టణానికి చెందిన హిందూ ఫౌండేషన్ వారు నూతన వస్త్రాలను బుధవారం పంపిణీ చేశారు. చీరలు, రెడీమేడ్ దుస్తులను సంస్థ జిల్లా అధ్యక్షురాలు ఉమా భారతి పంపిణీ చేశారు. కార్యదర్శి ధనలక్ష్మి, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
JGL: భీమారం మండలంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి సిద్ధిధాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రూపంలో అమ్మవారు భక్తులకు అష్టసిద్ధులను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అర్చకులు, భవాని దీక్షాపరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
MLG: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, ఏదైనా అసౌకర్యం కలిగితే ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉందని, ఎవరు ఉల్లంఘించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
SRCL: దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా VMD రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి తెప్పోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేవి నవరాత్రి ఉత్సవాలు రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పదవ రోజు సందర్భంగా అమ్మవారు సిద్ధి ధాత్రి అలంకారంలో దర్శనమీయగా రాత్రి ఆలయ ధర్మగుండంలో తెప్పోత్సవం కార్యక్రమాన్ని వేద పండితుల పూజ నిర్వహించారు.
SDPT: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్ కే.హైమావతి ఆధ్వర్యంలో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ బృందాలకు బుధవారం శిక్షణ నిర్వహించారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు నిబంధనలను ఉల్లంఘించకుండా, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆమె సూచించారు. రూ. 50 వేలకు మించి నగదు తరలించేటప్పుడు సరైన పత్రాలు లేకపోతే సీజ్ చేయాలన్నారు.