NGKL: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తామని కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు సురేష్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఇప్పటివరకు ఒకసారి సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం రాలేదని పేర్కొన్నారు.
MDK: చిన్నశంకరంపేట ప్రాథమిక సహకార సంఘం కార్యాలయాన్ని వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఎరువులు కొన్న ప్రతి రైతుకు తప్పకుండా రసీదులు ఇవ్వాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. ఈ తనిఖీలో సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి పాల్గొన్నారు.
RR: షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు సీఐగా నరసయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. సీఐ మాట్లాడుతూ.. మండలంలో ఏదైనా సమస్య ఉంటే నేరుగా తమ వద్దకు వచ్చి కలవాలని, గ్రామాలలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులకు అందరూ సహకరించాలని కోరారు.
BDK: బూర్గంపాడు మండల కేంద్రంలో గోదావరి వరద ప్రవాహానికి పత్తి, వరి పంటలు నీటా మునిగి తీవ్రంగా నష్టపోయినట్లు రైతు గంగరాజు యాదవ్ మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీట మునిగి తీవ్ర నష్టం కలిగించిందని రైతు తెలిపారు. ప్రభుత్వం తమను రక్షించాలని వేడుకున్నారు.
HNK: దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు BRS రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో సుభాష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో మంగళవారం BRS నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
MLG: తాడ్వాయి మండలం మేడారంలో మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా ఇవాళ పూజారులు ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం భూమి పూజ నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. భక్తుల రద్దీ నియంత్రణ కోసం తల్లులు, గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెలను ఒకే వరుసలో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 23న ఆవిష్కరించారు.
NRML; ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారు సిద్ధి దాత్రి అమ్మవారుగా ప్రజలకు దర్శనమిస్తున్నారు. దుర్గాష్టమి పురస్కరించుకొని అమ్మవారిని వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు సంతోష్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి పూజలు చేయిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో రెండో విడతలో MPTC, ZPTC ఎన్నికలు జరిగే మండలాల వివరాలు ఇలా ఉన్నాయి. రఘునాథపాలెం మండలం- 13, కొణిజర్ల-15, సింగరేణి-16, వైరా-10, ఏన్కూరు-10, కల్లూరు-13, తల్లాడ-16, పెనుబల్లి-15, సత్తుపల్లి-13, వేంసూరు-13. రెండో విడతలో మొత్తం 10 స్థానాల్లో జడ్పీటీసీ, 134 స్థానాల్లో ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ☆ రెండవ విడత ఎన్నికల పోలింగ్ తేదీ: OCT 27
NZB: గ్రూప్-1లో 386వ ర్యాంకు సాధించి DSPగా ఎంపికైన గుత్ప గ్రామానికి చెందిన నిఖితను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి శ్రమను ఆయుధంగా మలుచుకొని కస్టపడి మొదట ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో (AE) ఉద్యోగం సాధించి ప్రస్తుతం గ్రూప్-1లో ర్యాంకర్‌గా నిలవడం జిల్లా గర్వకారణమన్నారు.
NRML: వాహనదారులు రోడ్డు నిబంధనలు పూర్తిగా పాటిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చని నిర్మల్ పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పాఠశాల విద్యార్థులచే ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
MBNR: విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షులు మురళీధర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్య సమాజ్ మందిరంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండవ తేదీన సాయంత్రం 5 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సాయంత్రం 7 గంటలకు బాయ్స్ కళాశాల మైదానంలో బాణసంచా కాల్చడం జరుగుతుందని తెలిపారు.
MDK: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో కొలువుదీరిన శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం వేకువ జామున అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన సహస్రనామావళి నిర్వహించినట్లు ఆలయ ఈఓ రంగారావు తెలిపారు. దసరా సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు దీంతో ఆలయంలో సందడి నెలకొంది.
BDK: దమ్మపేట మండలంలో మంగళవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద దేవి శరన్నవరాత్రుల ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన అమ్మవారి ప్రతిమను ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
NZB: ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ నూతన ఛైర్మన్‌గా రేగుల్ల సత్య నారాయణ ఎన్నికయ్యారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కమల ఆధ్వర్యంలో మంగళవారం ఛైర్మన్‌తో పాటు నారాయణ రెడ్డి, రమణ, భోజన్న, చిట్యాల నవీన్ డైరెక్టర్‌లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయాభివృద్ధికి దుకాణ సముదాయాల కిరాయిలు వినియోగించాలని ఇన్స్పెక్టర్ సూచించారు.
HNK: గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ పరిధి అసంపర్తి మండలంలోని భీమారం గ్రామానికి చెందిన సరోజన సోమవారం గుండెపోటుతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట MLA కె.ఆర్ నాగరాజు మంగళవారం ఉదయం వారి నివాసానికి వెళ్లి ఆమె పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.