KNR: తిమ్మాపూర్ మండలం LMD కాలనీకి చెందిన సుధాకర్, చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన అనిల్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు 6 నెలల క్రితం తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నారు. LMD పోలీసులు మంగళవారం రెండు ఫోన్లను గుర్తించి, బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నవారు సీఐఈఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు.
కరీంనగర్ కేంద్రంలోని విద్యానగర్ అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (U-PHC)ని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వచ్చే రోగులకు అందించే OPD, NCD, arogya mahila ,ilr, lab , pharmacy సేవలను పరిశీలించి తరువాత అవసరమైన సూచనలు చేసారు.
NRPT: అక్టోబరు 21న జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం, వ్యాసరచన పోటీలలో ఔత్సాహికులు పాల్గొనాలని ఎస్పీ డాక్టర్ వినీత్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. పోలీస్ విధుల్లో ప్రతిభను తెలిపే పొటోలు, వీడియోలను జిల్లా పోలీస్ కార్యాలయంలోని పీఆర్వో వెంకట్‌కు అందించాలని సూచించారు.
NGKL: బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పాఠశాలల విద్యార్థుల సంక్షేమంపై కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టిన పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా జాగో బంజారా సేన అధ్యక్షుడిగా డాక్టర్ భూపాల్ నాయక్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర బంజారా కార్యాలయంలో వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్ మంగళవారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భూపాల్ నాయక్ మాట్లాడుతూ.. బంజారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
KMM: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీసు సేవా పతకాలలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అందించిన అత్యుత్తమ సేవలకు గాను పలువురు పోలీస్ సిబ్బందికి పతకాలు లభించాయి. పతకాలు పొందిన అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, టౌన్ ఏసీపీ రమణమూర్తి, సిీసీఆర్బీ ఏసీపీ సాంబరాజు, పోలీస్ సిబ్బంది మంగళవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిని సీపీ అభినందించారు.
NLG: దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) ఇన్సూరెన్స్ గురించి HELP DESK ఏర్పాటు చేసినట్లు మునిసిపల్ కమిషనర్ వై. సుదర్శన్ తెలిపారు. ప్రతి ఒక్కరు విధిగా మీ బ్యాంకు ద్వారా ఇన్సురెన్స్ చేసుకోవాలని సూచించారు. దీని వలన ప్రమాదం జరిగినప్పుడు రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని ఆయన తెలిపారు.
SRD: బీఆర్ఎస్ డివిజన్ కార్యదర్శి షరీఫ్ నేతృత్వంలో సమావేశం జరిగింది. మంగళవారం పటాన్‌చెరు ఇంఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, అలంపూర్ కార్పొరేటర్ గౌస్ కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. డోర్ టూ డోర్ ప్రచారం చేయాలని, KCR పాలనలో అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. మగంటి గోపీనాథ్ అభివృద్ధిని గుర్తుకు తెచ్చుతూ, మగంటి సునీతని గెలిపించేందుకు కృషి చేయాలన్నారు.
BHNG: యాదగిరిగుట్ట మండలం కాచారం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెనుక నుంచి వచ్చిన ట్రాలీ ఆటో రెండు బైకులను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతుడు రాజాపేట మండలం బేగంపేటకు చెందిన నీలం నర్సింహులు(55)గా, గాయపడిన వ్యక్తి రాములుగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఒకే ఇంట్లో ఇటీవల 43 ఓట్లు నమోదు కాగా అక్కడికి వెళ్లి అడిగితే వాళ్ళు ఎవరో మాకు తెలియదని ఆ ఇంట్లో ఉండే మహిళ చెప్పిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. మరొక ఇంట్లో 23 ఓట్లు ఉంటే అక్కడికి వెళ్లీ అడిగితే, వాళ్లు ఎవరో కూడా నాకు తెలీదని ఇంటి ఓనర్ చెబుతున్నారన్నారు.
SRD: సంగారెడ్డిలోని మెడికల్ కళాశాలలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు కృషి చేస్తానని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మెడికల్ కళాశాలలో మంగళవారం పరిశీలించారు. క్రీడా మైదానం ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్ఎంపీ అధికారులకు సూచించారు. విద్యార్థుల కోసం క్రికెట్, వాలీబాల్, త్రో బాల్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్ కోట్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అందుకు తగ్గంటూ.. ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో జి.రవి నాయక్ తెలిపారు. మంగళవారం దేవస్థానంతో పాటు కొండ కింద సత్యనారాయణ వ్రత మండపాన్ని ఆయన పరిశీలించారు. ఆయనతోపాటు ఆలయ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
NRPT: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన చికిత్సలు అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం మండలంలోని తీలేరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆమె పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. అలాగే, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చెందిన మహిళ బస్సు రేణుక (24) అదృశ్యమైనట్లు తండ్రి బుస్సు యాదయ్య ఫిర్యాదుతో మంగళవారం చిట్యాల పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం … ఈనెల 4న రేణుక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎంఎస్సీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుందని, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తెలిపారు.
WGL: రాయపర్తి తహసిల్దార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సాదా బైనామాకు చెందిన పలు రికార్డులను పరిశీలించారు. దరఖాస్తుదారుల సమస్యలను త్వరగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఐ చంద్రమోహన్ తదితరులున్నారు.