WNP: దీపావళి సందర్భంగా టపాసుల విక్రయదారులు తప్పనిసరిగా చట్టపరమైన నియమాలను పాటించాలని వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి సూచించారు. రద్దీ ప్రదేశాలు, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, పెట్రోల్ బంకుల సమీపంలో దుకాణాలు ఏర్పాటు చేయరాదన్నారు. ప్రజలు భద్రతా నియమాలు పాటిస్తూ, పిల్లలను పెద్దల పర్యవేక్షణలో టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ADB: తాంసి మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టు తాజా నీటి వివరాలను AEE హరీశ్ కుమార్ బుధవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 277.50 మీటర్లుగా ఉందన్నారు. మొత్తం నీటి సామర్థ్యం 0.571 టీఎంసీలకు గానూ ప్రాజెక్టులో 0.470 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఆయన తెలిపారు.
SRCL: బీడీ కార్మికుల పట్టా భూమిలోకి వచ్చి బీడీ కార్మికులను దూషించి, దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని చందుర్తి మండల కేంద్రం బీడీ కార్మికులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 40 సంవత్సరాల క్రితం సర్వేనెంబర్ 504లో ఎకరం 20 గుంటల భూమి 30 మంది బీడీ కార్మికులు ఇండ్ల స్థలాల కోసం కలిగి ఉన్నామన్నారు.
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం GHMC ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా 1950 హెల్ప్ లైన్, NGRSను ఏర్పాటు చేశారు. 1950 హెల్ప్ లైన్ ద్వారా ప్రజలు ఓటర్ల జాబితా, పోలింగ్ సెంటర్లు, ఎపిక్ కార్డులు తదితర వాటికి సంబంధించిన సమాచారం పొందడమే కాకుండా ఫిర్యాదులు చేయవచ్చు.
NLG: త్రిపురారం మండలం బాబాసాయిపేట నుంచి మిర్యాలగూడ వెళ్లే మార్గంలో భారీ వర్షాలకు బ్రిడ్జి దెబ్బతింది. దీంతో అధికారులు ఈ రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. బ్రిడ్జి త్వరగా మరమ్మత్తు చేయాలని, తమ ఇబ్బందులను తొలగించాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
RR: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు ప్రభుత్వం నిర్వహిస్తున్న టెండర్ల ప్రక్రియల భాగంగా హయత్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 28 షాపులకు 308 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 86 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా, ఈనెల 18తో టెండర్ల దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది.
HYD: నగరంలో ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఈనెల 12వ తేదీ వరకు సెల్ ఫోన్ డ్రైవింగ్‌పై మొత్తం 80,555 కేసులు నమోదు అయ్యాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. కేవలం ఈ రెండు రోజుల్లో వీటి సంఖ్య 2,345గా ఉందన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే హెల్ప్ లైన్ 9010203626, ఈ చలాన్ హెల్ప్ లైన్ డెస్క్ 8712661690కు ఫిర్యాదు చేయాలన్నారు.
NGKL: జిల్లాలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి అధునాతనమైన సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామని జిల్లా SP గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ IPS తెలిపారు. నాగర్ కర్నూల్ టౌన్ నందు ప్రధాన రహదారులు, చౌరస్తాలను SP పరిశీలించారు. బస్టాండ్ వద్ద, నాగనూలు, శ్రీపురం చౌరస్తాలలో సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
NRPT: నర్వ మండలం రాయికోడ్ గ్రామానికి చెందిన జాతీయ వాలీబాల్ ప్లేయర్ పుల్లరి అనన్య శ్రీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. మంగళవారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ఆమె సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఎం ఆమెను శాలువాతో సత్కరించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
BHNG: తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) బి. శివధర్ రెడ్డిని మంగళవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి హర్థిక శుభాకాంక్షలు తెలిపారు. వారికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సత్కారం చేశారు. అలాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రసాదం అందజేశారు.
NRML: బాసర అమ్మవారి ఆలయంలో 83 రోజుల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ EO వివరాలు తెలుపగా రూ.81,69,099 నగదు ఆదాయం వచ్చినట్లు, మిశ్రమ బంగారం 91.500 గ్రా, మిశ్రమ వెండి 3.500గ్రా, విదేశీ కరెన్సీ 79 నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, సేవ సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం (TRKS) జిల్లా నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏడుకొండల వెంకటేశం అధ్యక్షతన కనగల్ మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో.. జిల్లా కన్వీనర్ రాధారపు బిక్షపతి, కో కన్వీనర్ గంగాధరి వెంకటేశ్వర్లు, మహిళా విభాగం కన్వీనర్ గా ఎగిరి శెట్టి అనిత ఎంపికయ్యారు.
MDCL: వీధి వ్యభిచారం చేస్తున్న 9 మందిని అరెస్టు చేసిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. కూకట్ పల్లి భాగ్యనగర్ కాలనీలో 9 మంది మహిళలు రోడ్డుపై వెళ్తున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తూ అసభ్య సైగలు చేస్తున్నారు. దీంతో వారిని పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి మంగళవారం స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి బైండోవర్ చేశారు.
MBNR: ఉమ్మడి పాలమూరులో 227 ఏ4 మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ వేగవంతమైంది. దరఖాస్తుల స్వీకరణ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 508 టెండర్లు దాఖలయ్యాయి. దీని ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే రూ.15.24 కోట్ల ఆదాయం సమకూరింది. మద్యం వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి భారీ మొత్తంలో దరఖాస్తులు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
NLG: ఈనెల 25న నల్గొండ NG కాలేజ్ గ్రౌండ్‌లో జరగనున్న సదర్ సమ్మేళనం కార్యక్రమానికి హాజరుకావాలని మంగళవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నల్గొండ జిల్లా అఖిల భారత యాదవ సంఘం నాయకులు రాష్ట్ర సెక్రటేరియట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.