MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో భూ, రెవెన్యూ సమస్యలపై అధికారులు ఇంటింటా సర్వే నిర్వహించారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి భూములకు సంబంధించిన వివాదాలు, రెవెన్యూ సమస్యలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను నమోదు చేసి పరిష్కార చర్యల కోసం వివరాలను సేకరించారు.
KMM: కల్లూరు మండలంలోని గంగారం గ్రామ శివారులో కోడిపందేలు నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు శనివారం తెల్లవారుజామున దాడి చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.65 వేల నగదు, కోడిపుంజులు, కత్తులు, 6 బైక్లు, 11 కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
BDK: కరకగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ పోలే బోయిన సుజాత అభివృద్ధి పనులలో భాగంగా ప్రజల సౌకర్యార్థం త్రాగునీటి సమస్యను శనివారం పరిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీటి సమస్యతో పాటు గ్రామంలోని ఇతర మౌలిక వస్తువుల సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాన్ని తెలిపారు.
KMR: బాన్సువాడలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్ల ఘటనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రిలియన్స్ మార్ట్ వద్ద జరిగిన గొడవ, కానిస్టేబుల్‌పై దాడికి సంబంధించి ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం బృందాలు గాలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో రూ.7.50 కోట్లతో రోడ్ల నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పలు కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఇంజనీర్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పనులు నాణ్యతగా జరిగేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
KNR: సైదాపూర్ మండలం ఆకునూర్ కస్తూరిబా బాలికల విద్యాలయంలో శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌వో రజిత మాట్లాడుతూ.. ఒక వ్యక్తి తన చిన్నతనంలో కుటుంబ సభ్యుల ద్వారా నేర్చుకునే భాషనే మాతృభాష అంటారని పేర్కొన్నారు. ఇది మనిషికి వ్యక్తిత్వంతో పాటు గుర్తింపునిస్తుందని తెలిపారు.
SDPT: దుబ్బాక మండలం రామక్కాపేట గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం సరిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల వసతి చదువుల పట్ల నిర్లక్ష్యం చేయొద్దని ఉపాధ్యాయులకు సూచించారు.
NRPT: దొంగతనాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన చౌరస్తాల్లో పోలీస్ సిబ్బందితో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల చేతి వేలి ముద్రలను ప్రత్యేక డివైజ్‌తో తనిఖీ చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
నిర్మల్ పట్టణంలోని 42 వార్డుల ప్రజలు ఆస్తి పన్నును గడువులోగా చెల్లించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారి రాజు శనివారం ప్రకటనలో తెలిపారు. పన్నుల వసూలుకు 18 బృందావనం ఏర్పాటు చేశామని ఇందుకోసం వార్డు ఆఫీసర్లు ఇంటింటా తిరుగుతూ పన్నులను వసూలు చేస్తున్నారని ఆయా వార్డ్ ఆఫీసర్లకు తమ పన్నులను చెల్లించి అధికారులకు సహకరించాలని తెలిపారు.
SRPT: రాబోయే వేసవిలో వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ ఆపరేషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. నర్సింహులు అధికారులను ఆదేశించారు. శనివారం సూర్యాపేటలోని 60 ఫీట్ల రోడ్డులో నిర్వహించిన ‘ప్రజా బాట’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
BHPL: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు, విద్యార్థినులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఇందిరా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత గల విద్యార్థులు మార్చి 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇందిర సూచించారు.
SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలు శనివారం ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. హుజూర్ నగర్ మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్, విజ్ఞాన నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తాయని అన్నారు.
RR: షాద్ నగర్ పట్టణంలోని 20వ వార్డులో తాగునీటి ఎద్దడికి పరిష్కారం లభించింది. నెలరోజులుగా బోరు పాడు కావడంతో ప్రజలు తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. వార్డు ప్రజలు ఈ విషయాన్ని కౌన్సిలర్ గోపాల్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కౌన్సిలర్ బోరును బాగు చేయించి తాగునీటి ఎద్దడిని తీర్చారు. దీంతో వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
JGL: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్కం రాజశేఖర్ (45) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు లుంగీతో ఉరివేసుకున్నాడు. మృతుడి అన్న లక్కం శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.
BHNG: రాష్ట్రంలో దుర్మార్గపు దౌర్జన్య పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ రాజాపేట మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్ అన్నారు. శనివారం రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్నాడనే కక్షతోనే బాల్క సుమన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం దుర్మార్గపు చర్య అని అన్నారు.