WGL: GWMC 14వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు, ఇతర పార్టీల నేతలు వర్దన్నపేట MLA కే.ఆర్ నాగరాజును మంగళవారం ఉదయం కలిశారు. అక్టోబర్ రెండో తేదీన జరిగే దసరా వేడుకలకు రావాలని వారు MLAను ఆహ్వానించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. స్థానిక కార్పొరేటర్ తూర్పాటి సులోచన- సారయ్య, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.
KMM: CPI శత వసంతాల ముగింపు సభ డిసెంబర్లో ఖమ్మంలో జరగనుండగా, అక్టోబర్ 5న సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినట్లు ఉమ్మడి జిల్లాల కార్యదర్శులు సాబీర్ పాషా, దండి సురేష్ తెలిపారు. ఖమ్మం SR గార్డెన్స్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి డి.రాజా, బినాయ్ విశ్వం, కె.నారాయణ, అజీజ్ పాషా, పువ్వాడ నాగేశ్వరరావు హాజరవుతారని వెల్లడించారు.
WGL: ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు తుది గడువు అని ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు నేడు ఒక్కరోజే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇంటి దగ్గర ఉండి టెన్త్, ఇంటర్ చదవాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ PHC లో ఆరోగ్య మహిళ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మండల వైద్యాధికారి అస్మా అఫ్షీన్ తెలిపారు. మంగళవారం రోజున పిహెచ్సి పరిధిలోని గ్రామాల్లోని మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి రక్త పరీక్షలు చేశామన్నారు. మహిళలకు రక్తహీనత తలెత్తకుండా పౌష్టికాహారమైన ఆహారం తీసుకోవాలని అవగాహన కల్పించారు.
MHBD: నెల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులకు ఎన్నికల నియమావళిపై స్థానిక ఎంపీడీవో సింగారపు కుమార్ అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. ఎన్నికల కమిషన్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో రాజకీయ ప్రచారం ఫ్లెక్సీలు వాల్ రేటింగ్ తొలగింపు చర్యలు చేపట్టాలని సూచించారు.
GDWL: ఆలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి మంగళవారం ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
JNG: పాలకుర్తి మండలానికి చెందిన గుండె పరశురాం వరల్డ్ రికార్డు ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్నారు. గతంలో రాష్ట్రపతి అవార్డు అందుకున్న ఆయనకు.. అంతర్జాతీయ సంస్థ అయిన నీఫా 25వ సిల్వర్ జూబ్లీలో భాగంగా ఆయనకు ‘వరల్డ్ రికార్డు ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు’ ప్రకటించింది. ఈ అవార్డును కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా అందుకున్నట్లు పరశురాం మంగళవారం తెలిపారు.
NRPT: జిల్లాలో రెండు విడుదలగా ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడుతలో కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, మద్దూర్, గుండుమల్, కొత్తపల్లి, నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ, మరికల్ మండలాల్లో నిర్వహిస్తారు. రెండో విడతలో మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్, కృష్ణ, మగనూర్, ఉట్కూర్, నర్వ మండలాల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి.
MBNR: జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేసిన ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ నాయక్ దంపతులను ఎస్పీ జానకి మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌గా గోపాల్ నాయక్ ఎంతో నిబద్ధతతో పనిచేశారని వెల్లడించారు.
BHPL: జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం తెలిపారు. నోడల్ అధికారులు నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, పటిష్ట పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గోడలపై రాజకీయ రాతలు, ఫ్లెక్సీలు తొలగించాలని, ఉల్లంఘనలపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
NGKL: అచ్చంపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేటీఆర్ జనగర్జన సభకు దీటుగా, తాను బీజేపీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో సింహాగర్జన సభ పెట్టాలని అధిష్టానాన్నికోరతానని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. తాను అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న నాయకుడినని తెలిపారు.
MBNR: ప్రమాదవశాత్తు వరిచేనులో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మిడ్జిల్‌లో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన రావుల బాలస్వామి(38)కూలి పని నిమిత్తం ఓ రైతుపొలంలో పంటకు పురుగుల మందు పిచికారి చేసేందుకు వెళుతుండగా మార్గమధ్యంలోని వరిచేనులో ప్రమాదవశాత్తు పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు
NLG: నకిరేకల్ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలు మొదటి విడతలోనే జరగనున్నాయి. నియోజకవర్గంలోని 6 మండలాల్లో MPP-6, ZPTC- 6, సర్పంచి 126, MPTC స్థానాలు-75 ఉన్నాయి. వీటిలో మహిళలకు 78 స్థానాలు రిజర్వ్ చేశారు. MPP, ZPTC స్థానాలు ఐదు, 73 సర్పంచ్ స్థానాలు మహిళలకు కేటాయించారు. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయని ఆశపడ్డ పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు నిరాశకు లోనయ్యారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల శివారులో మంగళవారం తెల్లవారుజామున రెండు బైక్‌లు ఢీకొని రాకేశ్ (30), అభి (25) అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. రఘు, ఆదర్శ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రవణ్ ఘటనాస్థలిని పరిశీలించి, కేసు నమోదు చేశారు.