• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఏసీబీ వలలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు

KNR: కరీంనగర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్తీక్, ప్రైవేట్ వ్యక్తి రాములు 20 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు.

October 7, 2025 / 07:33 PM IST

‘కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుంది’

SRCL: ఆటో డ్రైవర్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎల్లారెడ్డి పేట మండలం అడవి పదిర గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాంపల్లి సతీష్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య యత్రం చేసుకోగా మంగళవారం కేటీఆర్ పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నారని అన్నారు.

October 7, 2025 / 07:31 PM IST

ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు

BHNG: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ విద్వేషపూరిత ప్రసంగం, మతపరమైన మనోభావాలను కించపరిచి నందుకు కేసు నమోదు చేయాలని భువనగిరి పోలీస్ స్టేషన్‌ల్ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఫిర్యాదు చేశారు. ముస్లిం జేఏసీ నాయకులు మహమ్మద్ అతహర్, షరీఫ్, ఇబ్రహీం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజా సింగ్ ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలన్నారు.

October 7, 2025 / 07:28 PM IST

వరి పొలాలను కెవికె వైరా శాస్త్రవేత్తలు పరిశీలన

KMM: ముదిగొండ మండలం వల్లాపురం గ్రామంలో వరి పొలాలను కెవికె వైరా శాస్త్రవేత్తలు మంగళవారం పరిశీలించారు. గ్రామానికి చెందిన రైతు తాటికొండ రమేష్ వరి పొలంలో సుడిదోమ, బ్యాక్టీరియా తెగులు ఎండు తెగులు, ఆకు ముడతను శాస్త్రవేత్తలు గుర్తించారు. వరి పొలాలకు సోకుతున్న చీడపీడల నుంచి నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలో రైతులకు శాస్త్రవేత్తలు పలు సలహాలు ఇచ్చారు.

October 7, 2025 / 07:28 PM IST

సమాచార హక్కు చట్టంతో పారదర్శకత: కలెక్టర్

SRPT: సమాచార హక్కు చట్టం ద్వారా పాలనలో పారదర్శకత, బాధ్యత పెరుగుతుందని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని కలెక్టరేట్‌లో సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమాచార హక్కు చట్టం కింద ప్రజలు కోరిన సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత పౌర సమాచార అధికారులు, పబ్లిక్ అథారిటీలపై ఉందన్నారు.

October 7, 2025 / 07:18 PM IST

స్థానిక ఎన్నికల పై కార్యచరణ రూపొందించాలి : ఎస్పీ

ADB: స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ రూపొందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం తాంసి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా పరిశీలించారు. క్రమం తప్పకుండా రౌడీ షీటర్లను, హిస్టరీ షీటర్లను తనిఖీ చేయాలని అన్నారు. ఎస్పీతో పాటు ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి, రూరల్ సీఐ ఫణిదర్, తాంసి ఎస్సై జీవన్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

October 7, 2025 / 07:18 PM IST

‘కేసీఆర్ రే సీఎంగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు’

KMM: తల్లాడ మండలం అంజనాపురంకి చెందిన RMP వైద్యుడు కిన్నెర వెంకటేశ్వర్ రావుతోపాటు పలువురు మంగళవారం మాజీ MLA సండ్ర వెంకట వీరయ్య సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సండ్ర మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి, పేద ప్రజల బ్రతుకులు మారాలంటే మళ్ళీ KCRరే సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

October 7, 2025 / 07:14 PM IST

HNKలో పర్యటించిన జాతీయ ఎయిడ్స్ నియంత్రణ అధికారులు

HNK: కౌమార దశ నుండి HIV గురించి ప్రజలు, వైద్య సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా.టాంజిన్ డైకిడ్ అన్నారు. మంగళవారం జాతీయ స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ కన్సల్టెంట్ రాజీవ్ తివారితో కలిసి HNK జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు సంబంధించిన కార్యక్రమాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.

October 7, 2025 / 07:08 PM IST

నర్సంపేటలో బ్రహ్మ కమలాల అరుదైన దృశ్యం

WGL: నర్సంపేట పట్టణానికి చెందిన గందె లావణ్య-రాజిరెడ్డి ఇంటి ఆవరణలో 90 రోజుల వ్యవధిలో 12 బ్రహ్మ కమలాలు వికసించి అరుదైన దృశ్యం కనువిందు చేసింది. రాత్రి విరబూసి, తెల్లవారుజామున మూసుకుపోయే ఈ పుష్పాలు ఆధ్యాత్మిక చిహ్నంగా భావిస్తారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు ఇవాళ స్థానికులు తరలివచ్చారు. లావణ్య-రాజిరెడ్డి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

October 7, 2025 / 07:08 PM IST

అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే సమక్షంలో చేరికలు

NGKL: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో మంగళవారం వంగూరు మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన పలువురు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సిద్ధార్థ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నారని, సంక్షేమం బీజేపీతోనే సాధ్యమన్నారు.

October 7, 2025 / 07:05 PM IST

‘చీఫ్ జస్టిస్ పై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం’

MBNR: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అన్సార్ హుస్సేన్ అన్నారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీ.ఆర్ గవాయి పై దాడి భారత రాజ్యాంగంపై మరియు స్వతంత్ర న్యాయవ్యవస్థపై దాడిగా భావిస్తున్నామన్నారు.

October 7, 2025 / 07:02 PM IST

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో CPM ను ఆదరించాలి’

NLG: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల‌ ఎన్నికల్లో CPM పార్టీని ప్రజలు ఆదరించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. మంగళవారం కట్టంగూర్‌లోని అమరవీరుల స్మారక భవన్‌లో జరిగిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు. BJPని ఓడించడానికి CPM పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు.

October 7, 2025 / 07:01 PM IST

వ్యక్తిపై వీధి కుక్కల దాడి

KMM: వీధి కుక్కలు వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన మధిరలో జరిగింది. మంగళవారం మధిరలోని ముస్లిం బజార్‌లో కపిలవాయి శ్రీధర్ శర్మ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా అతనిపై కుక్కలు దాడి చేశాయి. శర్మ శరీరంపై తీవ్రంగా గాట్లు పడ్డాయి. స్థానికులు కుక్కలను తరిమికొట్టి అతని రక్షించి ఆసుపత్రికి తరలించారు. కుక్కల బెడదను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

October 7, 2025 / 07:00 PM IST

‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి అమానుషం’

HNK: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ దాడి అమానుషమని ధర్మ సమాజ్ పార్టీ (DSP) జిల్లా కన్వీనర్ మైదం రవి మహారాజ్ అన్నారు. భారత రాజ్యాంగ విలువలను అవమానపరిచేవిధంగా CJIపై చేసిన దాడిని ఖండిస్తు మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలో నిరసన తెలిపారు. నిందితుడైన న్యాయవాది రాకేష్ కిషోర్‌ను బహిరంగంగా ఉరితీయాలని DSP డిమాండ్ చేస్తోందన్నారు.

October 7, 2025 / 06:58 PM IST

‘మృతదేహాన్ని ఇండియాకు రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి’

RR: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీకి చెందిన పోలే చంద్రశేఖర్ అమెరికాలో టెక్సాస్‌లోని డల్లాస్ నగరంలో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. మృతుడి కుటుంబ సభ్యులను వారి నివాసంలో కలిసి పరామర్శించారు. మృతదేహాన్ని ఇండియాకు రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.

October 7, 2025 / 06:56 PM IST