RR: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీకి చెందిన పోలే చంద్రశేఖర్ అమెరికాలో టెక్సాస్లోని డల్లాస్ నగరంలో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. మృతుడి కుటుంబ సభ్యులను వారి నివాసంలో కలిసి పరామర్శించారు. మృతదేహాన్ని ఇండియాకు రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.