• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలు నిర్వహించాలి: కలెక్టర్

SRPT: గ్రామపంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నామినేషన్లు మొదలుకొని ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు చూసుకోవాలన్నారు.

October 7, 2025 / 08:10 PM IST

సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్

MLG: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం అదనపు కలెక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్ట వారోత్సవాల్లో భాగంగా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈనెల 12 వరకు జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు.

October 7, 2025 / 08:09 PM IST

కౌంటింగ్ కేందం పరిశీలించిన అధికారులు

MDK: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలోని రెసిడెన్షియల్ కళాశాలను నర్సాపూర్ ఆర్డిఓ మహిపాల్ పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు కోసం కళాశాల ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కేందనం కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, ఎంపీడీవో పాల్గొన్నారు.

October 7, 2025 / 08:08 PM IST

హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు

SRD: ఓ హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా జడ్జి భవాని చంద్ర మంగళవారం తీర్పు ఇచ్చారు. సదాశివపేటలో నివాసం ఉంటున్న బీరప్ప 05-08-2021 రోజున నిద్రమత్తులో ఉన్న పాపయ్య అనే వ్యక్తిని బండరాయితో కొట్టి చంపాడు. నేరం రుజువు కావడంతో బీరప్పకు జీవిత ఖైదు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ పరతోష్ పంకజ్ తెలిపారు.

October 7, 2025 / 08:07 PM IST

ఎన్నికల ప్రవర్తన నియమాలపై అవగాహన

MDK: తూప్రాన్ మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి పై అవగాహన శిక్షణ చేపట్టారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల సిర వినియోగంపై ఆర్డిఓ జయచంద్ర రెడ్డి అవగాహన కల్పించారు. అభ్యర్థులు రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బంది పాటించాల్సిన మార్గదర్శకాలను వివరించారు.

October 7, 2025 / 08:07 PM IST

కఠిన చర్యలకు ఎస్పీ ఆదేశం

NLG: డైట్ స్కూల్ సమీపంలో మైనర్ బాలికపై హత్యాచారం జరగ్గా ఆ ప్రదేశాన్ని మంగళవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. కేసు విచారణలో పురోగతి, సాక్ష్యాధారాల సేకరణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిపై తక్షణమే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

October 7, 2025 / 08:05 PM IST

స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సీఐ

WGL: గీసుకొండ మండల కేంద్రంలోని గొర్రెకుంట క్రాస్ వద్ద ఇవాళ రాత్రి 7:30 గంటలకు సీఐ విశ్వేశ్వర్‌ నేతృత్వంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

October 7, 2025 / 08:03 PM IST

పాలస్తీనా ప్రజల పోరాటానికి సంపూర్ణ మద్దతు: IFTU

NZB: ఇజ్రాయిల్ దాడులను ఆపి వేయాలనీ సీపీఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. గాజా పై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న దాడిని వ్యతిరేకిద్దామని. గాజా ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుదాం అంటూ మంగళ వారం NZB నగరంలోనీ IFTU ద్వారక నగర్ కార్యాలయం నుంచి వీక్లీ బజార్ చౌరస్తా వరకు పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు.

October 7, 2025 / 07:58 PM IST

ఆశ వర్కర్ల యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

NGKL: వంగూరు మండల కేంద్రంలో ఆశ వర్కర్ల యూనియన్ నూతన కమిటీని సీఐటీయూ జిల్లా నేత శివరాములు ఆధ్వర్యంలో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సుమతమ్మ అధ్యక్షురాలిగా, ఉపాధ్యక్షురాలిగా మహేశ్వరి, కార్యదర్శిగా బీ. సూర్య కళ, కోశాధికారిగా ప్రియాంక ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

October 7, 2025 / 07:51 PM IST

వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కేటీఆర్

SRCL: సిరిసిల్ల పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్, మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించగా కేటీఆర్ హాజరై పూజలు నిర్వహించారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

October 7, 2025 / 07:46 PM IST

45 కిలోల గంజాయి వట్టివేత

RR: భారీగా గంజాయిని పట్టుకున్న ఘటన చందానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. విశాఖ నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను విశ్వసనీయ సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 45 కిలోల గంజాయి, 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

October 7, 2025 / 07:42 PM IST

‘అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి’

NGKL: గాజాపై జరుగుతున్న మరణకాండను ఆపాలని, ఇజ్రాయిల్‌కు సహకరిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని AIYF జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆంజనేయులు, శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా NGKL బస్ స్టాండ్ దగ్గర మంగళవారం AIYF ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ మౌనంవీడి పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలపాలని డిమాండ్ చేశారు.

October 7, 2025 / 07:41 PM IST

‘రహదారి మరమత్తు పనులు వెంటనే చేపట్టాలి’

MLG: వెంకటాపురం మండలం నుండి వాజేడు వరకు ఉన్న ప్రధాన రహదారి పై భారీ గుంతలు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఒంటిమామిడి, చిరుతపల్లి, ప్రగళ్లపల్లి వద్ద భారీ గుంతలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికైనా ఈ సమస్య పై అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు మరమత్తు పనులు చేపట్టాలని వాహనదారులు ఇవాళ కోరారు.

October 7, 2025 / 07:39 PM IST

‘కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి’

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామ ఎంపీటీసీ క్లస్టర్ ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు మాట్లాడుతూ.. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీయాలని అన్నారు.

October 7, 2025 / 07:36 PM IST

శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

NZB: పట్టణ పరిధిలోని పెర్కిట్‌ మహిళా ప్రాంగణంలో వివిధ కోర్సుల్లో అందిస్తున్న శిక్షణకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని మహిళా ప్రాంగణం జిల్లా అధికారి ఇందిర కోరారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూడు నెలల నర్సింగ్ నెలరోజుల టైలరింగ్, బ్యూటిషన్‌లో శిక్షణకు ఈనెల 16లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

October 7, 2025 / 07:33 PM IST