• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.. ఛైర్ పర్సన్

MHBD: కేసముద్రం మున్సిపాలిటీ చెందిన బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోలేపాక నాగరాజు తండ్రి, పోలేపాక ఎల్లయ్య శనివారం అనారోగ్యానికి గురై మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత-వెంకన్న, వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ-నాగేశ్వరరావు మృతుడి నివాసానికి వెళ్లి ఎల్లయ్య పార్దివ దేహానికి పూలమాల చేసి నివాళులర్పించారు.

February 28, 2026 / 02:37 PM IST

టీకాల ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి

KMR: బాన్సువాడ మండలం హనుమాజీపేట PHC పరిధిలోని తిరుమలాపూర్, DM తండాలో శనివారం వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. రోహిత్ పరిశీలించారు. టీకాల అమలు విధానం, సేవల నాణ్యత, పనితీరును సమీక్షించారు. ఐస్ ప్యాక్స్ సంసిద్ధత, వినియోగం, కోల్డ్ చైన్ నిర్వహణపై ఆరా తీశారు. లబ్ధిదారుల డ్యూ లిస్టు పరిశీలించారు.

February 28, 2026 / 02:36 PM IST

వేరుశనగ గరిష్ఠ ధర రూ.10119

MBNR: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం పంట ఉత్పత్తుల ధరల వివరాలను కార్యదర్శి అశోక్ అహ్మద్ తెలిపారు. వేరుశనగకు గరిష్ఠ ధర రూ. 10,119 కనిష్ఠ ధర రూ.5265 లభించగా, మొక్కజొన్నకు గరిష్ఠ ధర రూ.1854, కనిష్ఠ ధర రూ.1781 లభించింది. పత్తికి గరిష్ఠ ధర రూ.6129 కనిష్ఠ ధర రూ.4029 లభించింది. జొన్నలకు గరిష్ఠ ధర రూ.5230, మినుముల గరిష్ఠ ధర రూ.7,879 ధర లభించింది.

February 28, 2026 / 02:33 PM IST

చిట్యాల మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన

NLG: చిట్యాల, 7వ వార్డు కమ్యూనిటీ హాల్‌లోని వాటర్ ప్లాంట్ సామాగ్రిని నిన్న రాత్రి అక్రమంగా తొలగించారు. ఈ చర్యను నిరసిస్తూ.. మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ లింగస్వామి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. తీసుకొచ్చిన సామాగ్రిని తిరిగి అమర్చి నీటి సౌకర్యాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తూ కమిషనర్‌కు వినతి ఇచ్చారు.

February 28, 2026 / 02:33 PM IST

‘ఉమ్మడి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోండి’

WGL: తపాలా సేవల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి వినియోగదారులు తమ ఫిర్యాదులను మార్చి 9లోగా HYD పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయానికి పంపాలని WGL డివిజన్ సూపరింటెండెంట్ రవికుమార్ సూచించారు. మార్చి 25న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 53వ ప్రాంతీయ డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 28, 2026 / 02:33 PM IST

మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం

NZB: డిచ్‌పల్లి మండలంలోని ఎస్బీఐ గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా వ్యాపార, ఉపాధి రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం టైలరింగ్, మగ్గం, బ్యూటీ పార్లర్ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు టూల్ కిట్లు పంపిణీ చేశారు.

February 28, 2026 / 02:32 PM IST

ఛైర్మన్ పీఠంపై కాంగ్రెస్ కుట్ర రాజకీయాలు

MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై కాంగ్రెస్ కుట్ర రాజకీయాలను బట్టబయలు చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీపీఐ, బీఆర్ఎస్ మధ్య చిచ్చుపెట్టి, అడ్డదారిలో రాజకీయ లబ్ధి పొందాలని మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ చూస్తున్నారని విమర్శించారు.

February 28, 2026 / 02:32 PM IST

కేజీవాల్ పై తప్పుడు కేసులు బీజేపీ కుట్ర

KMM: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజీవాల్ పై తప్పుడు కేసులు బీజేపీ కుట్రేనని ఆమ్ ఆద్మీ పార్టీ పాలేరు ఇన్‌ఛార్జ్ పసుమర్తి శ్రీనివాస్ అన్నారు. శనివారం నేలకొండపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రివాల్ పై న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చినా బీజేపీ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ఇకనైనా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు.

February 28, 2026 / 02:31 PM IST

పదవీ విరమణ సందర్భంగా ఎస్సైకి SP సన్మానం

ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో A.R. SI శ్రీనివాస్ పదవీ విరమణ సందర్భంగా శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నితికా పంత్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీనివాస్‌ను శాలువాతో సత్కరించారు. పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన రూ.1,57,146 విలువైన చెక్‌ను అందజేశారు. అనంతరం పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

February 28, 2026 / 02:30 PM IST

నాలుగో రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం: డీఐఈవో

మెదక్: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(DIEO) మాధవి తెలిపారు. జనరల్ విభాగంలో 4,869 మందికి గాను 4,799 మంది, ఒకేషనల్ విభాగంలో 540 మందికి గాను 525 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తంగా 98.42% హాజరు నమోదైందని వివరించారు.

February 28, 2026 / 02:23 PM IST

ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌కు సన్మానం

MDK: ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవి రెండేళ్లు పొడిగించిన సందర్భంగా టీయూడబ్ల్యూజే (IJU) రాష్ట్ర అధ్యక్షులు ఖాజా విరాహత్ అలీతో కలసి తూప్రాన్ డివిజన్ పాత్రికేయులు శ్రీనివాస్ రెడ్డిని సత్కరించారు. ఐజేయు మాజీ సభ్యులు బుక్క అశోక్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా మాజీ అధ్యక్షులు పూర్ణ రాజుగౌడ్, ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు పురం మహేష్ ముదిరాజ్, వెంకట్ పాల్గొన్నారు.

February 28, 2026 / 02:23 PM IST

చేర్యాల పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉండాలి: ఎంపీ

సిద్దిపేట: చేర్యాల కాంగ్రెస్ కౌన్సిలర్లు శనివారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, చేర్యాల నకాషి బొమ్మను బహుకరించారు. ఈ సందర్భంగా ఎంపీ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని దిశానిర్దేశం చేశారు. బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు.

February 28, 2026 / 02:23 PM IST

హైకోర్టు జడ్జిని కలిసిన జిల్లా కలెక్టర్

సిద్దిపేట: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి పుల్ల కార్తీక్ శనివారం సిద్దిపేట పర్యటనకు విచ్చేశారు. హరిత మినర్వా హోటల్లో కలెక్టర్ కె.హైమావతి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం జిల్లా కోర్టులో న్యాయశాఖ అధికారులు, సిబ్బందితో కలిసి న్యాయపరమైన అంశాలపై నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో జడ్జి పాల్గొన్నారు.

February 28, 2026 / 02:21 PM IST

టైలర్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారే

BDK: ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా శనివారం అశ్వరావుపేట మండల కేంద్రంలో యూనియన్ సభ్యులు నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరై టైలర్ లను అభినందించారు. MLA జారే ఆదినారాయణ హాజరై టైలర్ లను అభినందించారు. పేద కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వరలక్ష్మి, ఉమాదేవి ఇరువురికి తన సొంత నిధులతో రెండు కుట్టు మిషన్లు అందజేశారు.

February 28, 2026 / 02:21 PM IST

లక్ష్మీ నరసింహ స్వామి సేవలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నారాయణ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వారికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం తెలిపారు. దర్శనానంతరం వేద ఆశీర్వచనం అర్చకులు అందజేయగా, స్వామివారి లడ్డు ప్రసాదం ఆలయ అధికారులు అందజేశారు.

February 28, 2026 / 02:21 PM IST